UGC NET 2025 Postponed: యూజీసీ నెట్‌ పరీక్ష వాయిదా.. కారణం ఇదే!

|

Jan 14, 2025 | 2:24 PM

యూజీసీ నెట్ 2024 డిసెంబర్ సెషన్ పరీక్షలు ఆన్ లైన్ విధానంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. జనవరి 16వ తేదీతో ఈ పరీక్షలు ముగుస్తాయి. అయితే జనవరి 15వ తేదీన జరగవల్సిన పరీక్ష మాత్రం వాయిదా పడింది. ఈ మేరకు యూజీసీ మంగళవారం (జనవరి 14) ప్రకటించింది. కొత్త తేదీని త్వరలోనే వెల్లడిస్తామని వెల్లడించింది..

UGC NET 2025 Postponed: యూజీసీ నెట్‌ పరీక్ష వాయిదా.. కారణం ఇదే!
UGC Net 2025 Postponed
Follow us on

న్యూఢిల్లీ, జనవరి 14: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 సెషన్‌ పరీక్షలు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. జనవరి 3వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్ష జనవరి 16వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే బుధవారం (జనవరి 15) జరగవల్సిన పరీక్ష మాత్రం వాయిదా పడింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) వెల్లడించింది. ఈ మేరకు పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఎన్టీయే మంగళవారం (జనవరి 14) ప్రకటించింది. జనవరి 15న నిర్వహించవల్సిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఈ సందర్భంగా ఎన్టీయే తెలిపింది. ఇక జనవరి 16న జరగాల్సిన పరీక్ష యథాతథంగా నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

జనవరి 3, 6, 7, 8, 9, 10, 15, 16 తేదీల్లో యూజీసీ నెట్‌ పరీక్షలు జరుగుతాయి. అయితే పండుగల నేపథ్యంలో అభ్యర్థుల నుంచి పలు వినతులు రావడంతో జనవరి 15న జరిగే పరీక్షను వాయిదా వేసినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. మొత్తం 2 పేపర్లకు ఈ పరీక్ష జరుగుతుంది. మొత్తం 85 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌ 1 లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులను కేటాయిస్తారు. 3 గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది.

పేపర్‌ 1లో రీజనింగ్‌ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైరెర్జంట్‌ థింకింగ్‌, జనరల్‌ అవేర్‌ననెస్‌పై ప్రశ్నలు ఉంటాయి. ఇక పేపర్ 2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్‌లో ప్రశ్నలు వస్తాయి. లాంగ్వేజెస్‌ మినహా మిగతా అన్ని క్వశ్చన్‌పేపర్లు ఇంగ్లిష్, హిందీ మీడియంలో మాత్రమే వస్తాయి. రిజర్వ్‌డ్ కేటగిరీ వారికి 35 శాతం, అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి 40 శాతం మార్కులు స్కోర్ చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.