UGC NET 2021: UGC NET పరీక్ష అడ్మిట్ కార్డును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలో జారీ చేయనుంది. అడ్మిట్ కార్డు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు NTA ugcnet.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే యుజిసి నెట్ పరీక్ష అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 8 వరకు మరియు అక్టోబర్ 17 నుండి 19 వరకు జరుగుతాయి. ఈసారి UGC NET డిసెంబర్ 2020, UGC NET జూన్ 2021 పరీక్ష ఒకేసారి నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా UGC NET డిసెంబర్ 2020, జూన్ 2021 లను విలీనం చేయాలని NTA నిర్ణయం తీసుకుంది. అయితే UGC NET 2021 అడ్మిట్ కార్డ్ సెప్టెంబర్ 21 నుంచి 24 మధ్య విడుదల చేసే అవకాశం ఉంది. అడ్మిట్ కార్డ్ విడుదలైన తర్వాత దాని లింక్ అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in లో అందుబాటులో ఉంటుంది.
అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేయడం ఎలా..
1. అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు మొదట UGC NET అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in ని సందర్శించాలి.
2. హోమ్‌పేజీ మధ్యలో దిగువ వైపు చూడండి లింక్ ఫ్లాష్ అవుతుంది.
3. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీతో పాటు భద్రతా కోడ్‌ని నమోదు చేయండి.
4. అడ్మిట్ కార్డు తెరపై కనిపిస్తుంది.
5. దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.
NTA సమాచారం ప్రకారం..
అక్టోబర్ 10న నెట్ కాకుండా మరికొన్ని ముఖ్యమైన పరీక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులు ఏ పరీక్షకు హాజరుకావాలో తెలియడం లేదు. అయితే ఈ సమస్యని పరిష్కరించడానికి పరీక్ష తేదీలలో మార్పులు చేయనున్నట్లు సమాచారం. రీ షెడ్యూల్ ఉంటుందని చెబుతున్నారు.