PBKS vs RR, IPL 2021: దుబయ్‌లో బౌండరీల సునామీ.. జైస్వాల్, మహిపాల్, లూయిస్ ధాటికి తేలిపోయిన పంజాబ్ బౌలర్స్.. టార్గెట్ 186

రాజస్థాన్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచిన బౌలింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ టీం రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడంలో విఫలమైంది.

PBKS vs RR, IPL 2021: దుబయ్‌లో బౌండరీల సునామీ.. జైస్వాల్, మహిపాల్, లూయిస్ ధాటికి తేలిపోయిన పంజాబ్ బౌలర్స్.. టార్గెట్ 186
Pbks Vs Rr Ipl 2021
Follow us
Venkata Chari

|

Updated on: Sep 21, 2021 | 9:40 PM

PBKS vs RR, IPL 2021: ఐపీఎల్ 2021లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ టీంల మధ్య జరుగుతోన్న మ్యాచులో రాజస్థాన్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులలకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచిన బౌలింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ టీం రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడంలో విఫలమైంది. దీంతో పంజాబ్ టీం ముందు 186 పరుగుల లక్ష్యం ఉంది.

ఇందులో జైస్వాల్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. మహిపాల్ 43 పరుగులతో రెండవ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మహిపాల్ 252 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లపై విరుచుకపడ్డాడు. కేవలం 17 బంతుల్లో 4 సిక్సులు, 2 ఫోర్లతో 43 పరుగులు బాదేశాడు.

లూయిస్ 36(7ఫోర్లు, 1 సిక్స్), లివింగ్‌స్టోన్ 25 (2 ఫోర్లు, 1 సిక్స్)పరుగులతో రాణించారు. మిగతా వారు అంతగా రాణించలేదు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్ 5, షమీ 3, ఇషాన్ పొరెల్, హార్‌ప్రీత్ చెరో వికెట్ పడగొట్టారు.

Also Read: PBKS vs RR, IPL 2021 Live: పంజాబ్ టార్గెట్ 186 పరుగులు.. బౌలర్లకు చుక్కలు చూపించిన రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్స్

Wasim Jaffer: పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మద్దతుపై నెటిజన్ల ట్రోల్స్.. డబుల్ సెంచరీతో సమాధానమిచ్చిన వసీం జాఫర్