UGC NET Exam Date 2022: జులై 8 నుంచి యూజీసీ నెట్‌-2022 పరీక్షలు

|

Jun 26, 2022 | 1:47 PM

యూజీసీ నెట్‌ 2022 పరీక్షలు జులై 8వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని యూజీసీ ఛైర్మన్‌ జగదీష్‌ కుమార్‌ శనివారం (జూన్‌ 25) ప్రకటించారు..

UGC NET Exam Date 2022: జులై 8 నుంచి యూజీసీ నెట్‌-2022 పరీక్షలు
Ugc Net 2022
Follow us on

UGC NET 2022 Exam Dates: యూజీసీ నెట్‌ 2022 పరీక్షలు జులై 8వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని యూజీసీ ఛైర్మన్‌ జగదీష్‌ కుమార్‌ శనివారం (జూన్‌ 25) ప్రకటించారు. ఈ ఏడాది 2021 డిసెంబరు, 2022 జూన్‌ పరీక్షలను కలిపి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సెషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు జులై 8,9,11,12 తేదీల్లో, అలాగే ఆగస్టు 12, 13, 14 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని జగదీష్‌ కుమార్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. పరీక్షలకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్‌ను త్వరలో అధికారిక వెబ్‌సైట్‌ http://nta.ac.in లేదా https://ugcnet.nta.nic లో ప్రచురిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తొలుత విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం యూజీసీ నెట్‌ పరీక్షలు జూన్‌లో నిర్వహించవల్సి ఉంది.

ఐతే పరీక్షలకు దరఖాస్తు చివరి తేదీని మే 30 వరకు కమిషన్‌ పొడిగించింది. దీంతో పరీక్ష తేదీలు కూడా వాయిదా పడ్డాయి. ఈ మేరకు కొత్త తేదీలను ప్రకటించిన యూజీసీ కొత్త షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనుంది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.