UGC NET 2022 Exam Dates: యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్ 2022) పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింట్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ ఏడాది 2021 డిసెంబరు, 2022 జూన్ పరీక్షలను కలిపి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సెషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు జులై 9,11,12 తేదీల్లో, అలాగే ఆగస్టు 12, 13, 14 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ http://nta.ac.in లేదా https://ugcnet.nta.nic లో అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించింది. అప్లికేషన్ నంబర్, పుట్టినతేదీతో లాగిన్ అయ్యి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవడంలో ఏదైనా ఇబ్బంది తలెత్తినా లేదా వివరాలలో తప్పులు దొర్లినా ఎన్టీఏ హెల్ప్ లైన్ నంబర్ 011-4075 9000కు ఫోన్ చేయవచ్చు. లేదా ugcnet@nta.ac.inకు మెయిల్ పంపవచ్చని యూజీసీ తెల్పింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.