
యుకో బ్యాంక్ (UCO Bank).. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 532 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 7, తెలంగాణలో 8 ఖాళీలున్నాయి. ఈ నియామకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒకే రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా అక్టోబర్ 30, 2025వ తేదీలోపు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూవనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. స్థానిక భాషలో ప్రావీణ్యం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి అక్టోబర్ 01, 2025 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 10 నుంచి 15 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలు ఉన్న వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 30, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మొదట ఎన్‌ఏటీఎస్ పోర్టల్ లో NATS Portal రిజిస్టర్ కావాలి. ఆ తరువాత యుకో బ్యాంక్ వెబ్‌సైట్ ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేయాలి.
దరఖాస్తు సమయంలో పరీక్ష ఫీజు కింద పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.400, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.800 చొప్పున చెల్లించాలి. జీఎస్టీ ఫీజు అదనంగా చెల్లించవల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ఫీజు లేదు. ఆన్‌లైన్ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది వెబ్‌సైట్ లింక్‌లో తెలుసుకోవచ్చు.
ఆన్‌లైన్ రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలకు 60 నిమిషాల్లో ఉంటుంది. జనరల్, ఫైనాన్స్ అవేర్‌నెస్ విభాగం నుంచి 25, ఇంగ్లిష్/హిందీ భాషలో 25, రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్‌లో 25, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.