TSSPDCL Recruitment 2022: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్! విద్యుత్‌ శాఖలో 201 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. 

|

Jun 16, 2022 | 8:54 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TSSPDCL).. 201 సబ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టుల (Sub Engineer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ..

TSSPDCL Recruitment 2022: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్! విద్యుత్‌ శాఖలో 201 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. 
Tsspdcl
Follow us on

TSSPDCL Sub Engineer (Electrical) Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TSSPDCL).. 201 సబ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టుల (Sub Engineer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం క్లుప్తంగా మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టులు: 201

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: సబ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టులు

ఖాళీల వివరాలు:

  • సబ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) ఎల్‌ఆర్‌ పోస్టులు: 19
  • సబ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) జీఆర్‌ పోస్టులు: 182

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 88,665ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (DEE) (లేదా) డిప్లొమా/ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (DEEE) లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ (లేదా) ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్/ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష (CBT) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ.200
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు: రూ.120

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్‌ 15, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 5, 2022.

హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌: జులై 23, 2022 నుంచి

రాత పరీక్ష తేదీ: జులై 31, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.