TSPSC Exam Postponed: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆ పోస్టుల రాత పరీక్షను వాయిదా వేసిన టీఎస్పీయస్సీ! కొత్త తేదీ ఇదే..

|

Sep 06, 2023 | 3:07 PM

తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్య, సాంకేతిక విద్య కాలేజీల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్ష వాయిదా పదింది. ఈ నెల (సెప్టెంబర్‌) 11వ తేదీన నిర్వహించనున్నట్లు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో ప్రకటించింది. ఐతే కొన్ని కారణాల వల్ల ఈ పరీక్షను నవంబరు 14కి వాయిదా వేసినట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్పీయస్సీ) వెల్లడించింది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు పరీక్ష వాయిదా..

TSPSC Exam Postponed: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆ పోస్టుల రాత పరీక్షను వాయిదా వేసిన టీఎస్పీయస్సీ! కొత్త తేదీ ఇదే..
TSPSC PD Exam Postponed
Follow us on

హైదరాబాద్‌, సెప్టెంబర్ 6: తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్య, సాంకేతిక విద్య కాలేజీల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్ష వాయిదా పదింది. ఈ నెల (సెప్టెంబర్‌) 11వ తేదీన నిర్వహించనున్నట్లు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో ప్రకటించింది. ఐతే కొన్ని కారణాల వల్ల ఈ పరీక్షను నవంబరు 14కి వాయిదా వేసినట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్పీయస్సీ) వెల్లడించింది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు పరీక్ష వాయిదా వేసిన సంగతి గ్రహించవల్సిందిగా కోరింది. ఈ పరీక్ష నవంబర్ 14వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని కమిషన్‌ తన ప్రకటనలో తెలిపింది. ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల హాల్‌టికెట్లను పరీక్ష తేదీకి సరిగ్గా వారం రోజుల ముందు నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు అభ్యర్ధులు గ్రహించాలని, అపోహలు, వదంతులను నమ్మొద్దని సూచించింది.

రీసెర్చి అసిస్టెంట్, ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

నారాయణగూడలోని బాబు జగ్జీవన్‌రాం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రభుత్వ పాలన శాస్త్ర విభాగాధిపతి డా. వివిమల్లికకు ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ సైన్స్‌ రీసెర్చ్‌’ (ఐసీఎస్‌ఎస్‌ఆర్‌) సంస్థ కీలక ప్రాజెక్టు అప్పగించింది. తెలంగాణ ఇ-గవర్నెన్స్‌పై పరిశోధనకు సంబంధించి ‘మైనర్‌ రీసెర్చి ప్రాజెక్టు’ను ఈ సంస్థ మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రీసెర్చ్‌ అసిస్టెంట్, ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌ పోస్టుల భర్తీ కోసం అసక్తి కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించారు. రీసెర్చ్‌ అసిస్టెంట్ పోస్టుకు సామాజిక శాస్త్రంలో కనీసం 55 శాతం మార్కులతో పీహెచ్‌డీ, ఎంఫిల్, పీజీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌ పోస్టుకు ఏదైనా సోషల్‌ సైన్స్‌ విభాగంలో పోస్టుగ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబ‌రు 13లోపు నారాయణగూడలోని బాబు జగ్జీవన్‌రాం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో దరఖాస్తులను నేరుగా సమర్పించాలని సూచించారు.

మూడు నెలలు దాటినా ఇంకా అందని ఏపీ పదో తరగతి మార్కుల మెమోలు

ఆంధ్రప్రదేశ్‌ పదోతరగతి 2023 ఫలితాలు మే నెలలోనే విడుదలైన సంగతి తెలిసిందే. మూడు నెలలు గడుస్తున్నా ఇంత వరకు విద్యార్ధులకు ఒరిజినల్‌ మార్కుల మెమోలను బోర్డు జారీ చేయలేదు. టెన్త్‌ మార్కుల మెమోలు ఇప్పటికీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో ముద్రణ దశలోనే ఉన్నాయని ప్రభుత్వ పరీక్షల విభాగం తెల్పింది. మే నెలలో జారీ చేసిన షార్ట్‌ మెమోలతోనే విద్యార్దులు ఇంటర్ ప్రధమ సంవత్సరంలో ప్రవేశాలు పొందారు. మరోవైపు ఆలస్యంగా పదో తరగతి ఫలితాలు వెల్లడించిన సీబీఎస్‌ఈ బోర్డు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఎన్నో నెలల ముందే ఇచ్చేసింది. ప్రింటర్స్‌కు బిల్లులు పెండింగ్‌ ఉండడం వల్లే మెమోల జారీ ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.