తెలంగాణలో ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు విభాగాల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ తాజాగా మరో నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సంక్షేమ హాస్టళ్లలో ఉన్న 581 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 581 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -1(ట్రైబల్ వెల్ఫేర్) (05), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2(ట్రైబల్ వెల్ఫేర్) (106), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 మహిళలు (ఎస్సీ డెవలప్‌మెంట్) (70), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 పురుషులు (ఎస్సీ డెవలప్‌మెంట్) (228), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 (బీసీ వెల్ఫేర్) (140), వార్డెన్ గ్రేడ్ -1 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ (05), మ్యాట్రన్ గ్రేడ్ -1 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ (03), వార్డెన్ గ్రేడ్ -2 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ (03), మ్యాట్రన్ గ్రేడ్ -2 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ (02), లేడి సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోం ఇన్ వుమెన్ డెవపల్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ (19) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 06-01-2023న మొదలై 27-01-2023తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..