TSPSC Group 4 Result Date: దసరా తర్వతే తెలంగాణ గ్రూప్‌ 4 మెరిట్‌ జాబితా విడుదల.. ఆన్సర్‌ కీలో 10 ప్రశ్నలు ఔట్

|

Oct 17, 2023 | 9:52 PM

రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 సర్వీసుల పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన తుది ఆన్సర్ కీ కూడా ఇటీవల విడుదలైంది. ఇందుకు సంబంధించిన జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితాను కూడా వెలువరించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది జులై 1న రాతపరీక్ష నిర్వహించగా రాష్ట్రవ్యాప్తంగా 7.6 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. దీనికి సంబంధించి తుది ఆన్సర్‌ కీ వెల్లడించిన కమిషన్‌..

TSPSC Group 4 Result Date: దసరా తర్వతే తెలంగాణ గ్రూప్‌ 4 మెరిట్‌ జాబితా విడుదల.. ఆన్సర్‌ కీలో 10 ప్రశ్నలు ఔట్
TS Group 4 Result Date
Follow us on

హైదరాబాద్‌, అక్టోబర్ 17: రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 సర్వీసుల పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన తుది ఆన్సర్ కీ కూడా ఇటీవల విడుదలైంది. ఇందుకు సంబంధించిన జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితాను కూడా వెలువరించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది జులై 1న రాతపరీక్ష నిర్వహించగా రాష్ట్రవ్యాప్తంగా 7.6 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. దీనికి సంబంధించి తుది ఆన్సర్‌ కీ వెల్లడించిన కమిషన్‌ పేపర్‌ 1లో ఏడు ప్రశ్నలు తొలగించింది. ఇక పేపర్‌ 2లో కూడా మరో ప్రశ్నలు తొలగించింది. దీంతో గ్రూప్‌ 4 ఆన్సర్‌కీలో మొత్తం 10 ప్రశ్నలు తొలగించింది. రెండు పేపర్లకు కలిపి మొత్తం 13 ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేసింది.

ఇందులో అయిదింటికి ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలను సరైనవిగా ఉన్నట్లు కమిషన్‌ పేర్కొంది. ఇంతటితో గ్రూప్‌ 4 జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి అయినట్లైంది. ఇక మెరిట్ జాబితాను కూడా విడుదల చేయాలని కమిషన్‌ భావిస్తోంది. పరీక్ష రాసిన అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలు, జిల్లా స్థానికత, కేటగిరీ తదితర వివరాల ఆధారంగా మెరిట్‌ జాబితా ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో దసరా ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ కూడా నడుస్తోంది. దసరా పండగ తరువాత మెరిట్‌ జాబితా ఇవ్వాలని యోచిస్తున్నట్లు కమిషన్‌ వర్గాలు తెలిపాయి. మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై హైకోర్టు స్పష్టతపై కొంత ఆలస్యం కానుంది. ఇక ఎన్నికల కోడ్‌ కూడా పూర్తైన అనంతరం 1:2 నిష్పత్తి ప్రకారం తుది ఎంపిక జాబితాలు ప్రకటించనుంది.

ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 2023 టైర్‌ 1 తుది ఆన్సర్‌ కీ విడుదల

కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో మొత్తం 1,762 ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ ఎగ్జామినేషన్‌ 2023 టైర్‌-1 పరీక్షకు సంబంధించిన తుది ఆన్సర్‌ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) మంగళవారం (అక్టోబర్‌ 17) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పలు ప్రధాన పరీక్ష కేంద్రాల్లో సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ టైర్‌-1 పరీక్ష గత ఆగస్టు నెలలో నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్ష రాసిన అభ్యర్థులు ఎస్సెస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదు చేసి ఆన్సర్‌ కీతో పాటు ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కమిషన్‌ సూచించింది. టైర్-1 ప్రక్రియ పూర్తయితే టైర్2 పరీక్షలు, కంప్యూటర్‌ టెస్ట్ లేదా టైపింగ్‌ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు. ఈప్రక్రియ మొత్తం పూర్తయితే అభ్యర్థులను తుది ఎంపిక జాబితా వెలువరిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.