హైదరాబాద్, ఆగస్టు 30: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ విడుదలైంది. జులై 1న రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,878 పరీక్ష కేంద్రాల్లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం రెండు పేపర్లకు ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు కమిషన్ అధికారిక వెబ్ సైట్ నుంచి ఆన్సర్ కీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు అభ్యర్ధుల ఓఎంఆర్ పత్రాల ఇమేజింగ్ కాపీలు, క్వశ్చన్ పేపర్లు వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు కమిషన్ తెలిపింది.
కాగా దాదాపు 8,180 గ్రూప్-4 సర్వీసుల భర్తీకి జులై 1వ తేదీన రెండు పేపర్లకు ఆన్ లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించారు. పేపర్-1 పరీక్షకు 7,63,835 మంది హాజరుకాగా.. పేపర్-2 పరీక్షకు 7,61,028 మంది అభ్యర్థులు హాజరైనట్లు కమిషన్ తెలిపింది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఓఎంఆర్ పత్రాల ఇమేజింగ్ కాపీలను సెప్టెంబరు 27 సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని వివరించింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు లేవనెత్తాలని స్పష్టం చేసింది. అభ్యంతరాలను ఆన్ లైన్ విధానంలోనే నమోదు చేయాలని కమిషన్ కార్యదర్శి అనితారామచంద్రన్ వెల్లడించారు. గడువు తేదీ ముగిసిన తర్వాత, లేదంటే ఈ-మెయిల్ లేది ఇతర మార్గాల్లో వచ్చిన అభ్యంతరాలను స్వీకరించబోమన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 ప్రాథమిక కీ కోసం క్లిక్ చేయండి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్) ఎగ్జామ్-2023 నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టుల సంఖ్యలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. తొలుత నోటిఫికేసన్ లో మొత్తం 7,500 పోస్టులు ప్రకటించిన సంగతి తెలసిందే. తాజాగా అదనంగా 940 పోస్టులు కలిపింది. దీంతో పోస్టుల సంఖ్యను 8,440కు పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. నియామక ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్ విధానంలో నిర్వహించిన టైర్-1 పరీక్షలు జులైలో నిర్వహించిన విషయం తెలిసిందే. టైర్ 2 పరీక్షలు అక్టోబర్ 25, 26, 27 తేదీల్లో జరుగనున్నాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.