TSPSC Group 1 2024 Prelims: టీఎస్పీయస్సీ గ్రూప్1 ప్రిలిమ్స్ అభ్యర్ధులకు కీలక అప్‌డేట్‌.. ఓఎంఆర్‌ పద్ధతిలో పరీక్ష! ఎగ్జాం తేదీ ఇదే

|

May 16, 2024 | 6:52 AM

తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. జూన్ 9వ తేదీన గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష జరుగనున్న సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ రాత పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుందా? ఆఫ్‌లైన్‌ లో ఉంటుందా అనే విషయంలో గతంలో కమిషన్‌ స్పష్టత ఇవ్వలేదు. దీనిపై తాజాగా వివరణ ఇస్తూ..

TSPSC Group 1 2024 Prelims: టీఎస్పీయస్సీ గ్రూప్1 ప్రిలిమ్స్ అభ్యర్ధులకు కీలక అప్‌డేట్‌.. ఓఎంఆర్‌ పద్ధతిలో పరీక్ష! ఎగ్జాం తేదీ ఇదే
TSPSC Group 1
Follow us on

హైదరాబాద్‌, మే 16: తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. జూన్ 9వ తేదీన గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష జరుగనున్న సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ రాత పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుందా? ఆఫ్‌లైన్‌ లో ఉంటుందా అనే విషయంలో గతంలో కమిషన్‌ స్పష్టత ఇవ్వలేదు. దీనిపై తాజాగా వివరణ ఇస్తూ.. గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొంది. అంటే ప్రిలిమ్స్‌ పరీక్ష ఓఎంఆర్‌ (ఆప్టికల్‌ మార్క్‌ రికగ్నిషన్‌) పద్ధతిలో నిర్వహించనున్నట్లు కమిషన్‌ ప్రకటించింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అక్టోబర్ 21 నుంచి మెయిన్‌ పరీక్షను నిర్వహించనున్నారు.

కాగా మొత్తం 563 గ్రూప్‌-1 సర్వీసు పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి భారీ సంఖ్యలో దాదాపు 4.03 లక్షల దరఖాస్తులు అందాయి. భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినందున వీరందరికీ ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించడం కష్టంగా భావించిన కమిషన్‌.. ఆఫ్‌లైన్‌లోనే పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు పరీక్షకు వారం రోజుల ముందు నుంచి వెబ్‌సైట్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌లో నిర్ధిష్ట కటాఫ్‌ సాధించిన వారందరికీ మెయిన్స్ పరీక్షను అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నట్టు ఇప్పటికే కమిషన్‌ ప్రకటన వెలువరించింది. మెయిన్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.