TSPSC on Group 1 Postponement: తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష వాయిదా వేయాలంటూ విజ్ఞప్తులు.. క్లారిటీ ఇచ్చిన టీఎస్పీయస్సీ!

|

May 27, 2024 | 3:32 PM

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌1 ప్రిలిమినరీ పరీక్షను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతామని, వాయిదా వేసే ప్రసక్తే లేదని టీఎస్‌పీఎస్సీ తేల్చి చెప్పింది. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు స్పష్టం చేసింది. తొలుత ప్రకటించిన ప్రకారంగా జూన్‌ 9వ తేదీనే పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. పరీక్షకు వారం రోజుల ముందు అంటే జూన్‌ 1 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని..

TSPSC on Group 1 Postponement: తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష వాయిదా వేయాలంటూ విజ్ఞప్తులు.. క్లారిటీ ఇచ్చిన టీఎస్పీయస్సీ!
TSPSC Group 1 preliminary exam
Follow us on

హైదరాబాద్‌, మే 27: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌1 ప్రిలిమినరీ పరీక్షను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతామని, వాయిదా వేసే ప్రసక్తే లేదని టీఎస్‌పీఎస్సీ తేల్చి చెప్పింది. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు స్పష్టం చేసింది. తొలుత ప్రకటించిన ప్రకారంగా జూన్‌ 9వ తేదీనే పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. పరీక్షకు వారం రోజుల ముందు అంటే జూన్‌ 1 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని టీఎస్పీయస్సీ అధికారులు తెలిపారు. కాగా తెలంగాణలో మొత్తం 563 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల ప్రక్రియ ముగుస్తున్న క్రమంలో ఖమ్మం-వరంగల్‌, నల్లగొండ జిల్లాల్లో గ్రాడ్యుయేట్‌ ఎన్నికలు వచ్చాయి.

టీఎస్పీయస్సీ గ్రూప్‌ 1కు దరఖాస్తులు చేసుకొన్న వారిలో నిరుద్యోగులతో పాటు ఇన్‌ సర్వీసు ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇన్‌ సర్వీస్‌ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు నిరుద్యోగులు కూడా ఓట్ల ప్రచారంలో తలమునకలై ఉన్నందున తాము సరిగ్గా పరీక్షలకు చదవలేక పోయామంటూ, ప్రిలిమినరీ పరీక్షలను కనీసం 2 నెలలు వాయిదా వేయాలని టీఎస్‌పీఎస్సీకి గ్రూప్‌-1 అభ్యర్థులు విజ్ఞప్తులు చేశారు. గ్రూప్‌1 పరీక్ష వాయిదా కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారుకు కూడా వినతి పత్రం అందజేశారు. దీంతో గ్రూప్‌ 1 పరీక్ష జరుగుతుందో.. లేదోనని అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొంది. తాజాగా దీనిపై స్పందించిన టీఎస్పీయస్సీ గ్రూప్‌ 1 పరీక్ష వాయిదా వేయబోమని, ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.