తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ 2023 పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను టీఎస్పీయస్సీ మంగళవారం (జనవరి 31) విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారందరికి జూన్ 5,6,7,8,9,10,12 తేదీల్లో మొత్తం 7 పేపర్లకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తప్పనిసరిగా హాజరుకావల్సి ఉంటుంది. ఏ పేపర్‌కైనా గైర్హాజరైతే సదరు అభ్యర్ధిని అనర్హుడిగా పరిగణిస్తామని కమిషన్ సూచించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఇంగ్లిష్, ఉర్దూ, తెలుగు భాషల్లో నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. జనరల్ ఇంగ్లిష్ పేపర్ మినహా మిగతా పేపర్లన్నీ ఇంగ్లీష్ లేదా ఉర్దూ లేదా తెలుగు ఈ మూడు భాషల్లో ఏదైనా ఒక మాధ్యమంలో పరీక్షలు రాసేందుకు కమిషన్ అనుమతిచ్చింది. జనరల్ ఇంగ్లిష్ పేపర్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. అంటే ఈ పేపర్లో సాధించిన మార్కులను ర్యాంక్ కౌటింగ్‌కు లెక్కించడం జరగదు. కాగా 503 గ్రూప్-1 సర్వీసులకు గతేడాది అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు కూడా వెలువడ్డాయి.
ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున మూడు గంటల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది.
టీఎస్పీయస్సీ గ్రూప్-1 మెయిన్స్ పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.