TSPSC FSO Results 2022: తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి..

|

Dec 09, 2022 | 9:13 PM

తెలంగాణ రాష్ట్రంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌లో 24 ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ (ఎఫ్‌ఎస్‌వో) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు శుక్రవారం (డిసెంబర్‌ 9) విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు..

TSPSC FSO Results 2022: తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి..
TSPSC FSO Results
Follow us on

తెలంగాణ రాష్ట్రంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌లో 24 ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ (ఎఫ్‌ఎస్‌వో) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు శుక్రవారం (డిసెంబర్‌ 9) విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. కాగా నవంబర్‌ 7న నిర్వహించిన ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 16,381 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో రెండు పేపర్లకు 9,368 మంది హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ని నవంబర్‌ 15న టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.

నవంబర్‌ 16 నుంచి నవంబర్‌ 20 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. ప్రాథమిక ‘కీ’పై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం డిసెంబర్‌ 3న ఫైనల్‌ ఆన్సర్‌ ‘కీ’ని విడుదల చేసింది. ఇక దీనికి సంబంధించిన మెరిట్ జాబితాను కమిషన్‌ ఈ రోజు ప్రకటించింది. 1:2 చొప్పున త్వరలోనే ధ్రువపత్రాల పరిశీలన అర్హులైన వారిని పిలవనున్నట్లు కమిషన్‌ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.