Telangana Group 1: తెలంగాణ గ్రూప్‌1 అభ్యర్థులకు అలర్ట్‌.. ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీని ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ..

Telangana Group 1: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 పరీక్ష తేదీని ప్రకటించింది. అక్టోబర్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత గ్రూప్‌ 1..

Telangana Group 1: తెలంగాణ గ్రూప్‌1 అభ్యర్థులకు అలర్ట్‌.. ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీని ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ..
Tspsc Group 1 Exam

Updated on: Jun 14, 2022 | 8:42 PM

Telangana Group 1: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 పరీక్ష తేదీని ప్రకటించింది. అక్టోబర్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ రావడంతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. 503 పోస్టులకుగాను ఏకంగా 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్ట్‌కు ఏకంగా 756 మంది పోటీపడుతున్నారు. ప్రిలిమ్స్‌ పరీక్ష ముగిసిన తర్వాత జనవరి లేదా ఫిబ్రవరిలో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన 503 పోస్టులకుగాను 225 మహిళలకే కేటాయించడం విశేషం. ఈ రిజర్వ్‌ పోస్టులకు 1,51,192 మంది దరఖాస్తు చేసుకున్నారు. దివ్యాంగుల కేటగిరిలో 24 పోస్టులు ఉండగా 6,105 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒక్కో పోస్టుకు 254 మంది చొప్పున పోటీలో ఉన్నారు. ఇదిలా ఉంటే గతంలో టీఎస్‌పీఎస్సీ ప్రిలిమ్స్‌ పరీక్షను జులై లేదా ఆగస్టు నెలల్లో నిర్వహించనున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే సెప్టెంబరు నెలాఖరు వరకు పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, సివిల్స్, బ్యాంకు, పోలీసు కొలువుల పరీక్షలకు షెడ్యూలు ఖరారైన నేపథ్యంలో.. అభ్యర్థులు పరీక్షను అక్టోబర్‌లో నిర్వహించాలని విజ్ఞప్తి చేసుకున్న విషయం తెలిసందే. ఈ నేపథ్యంలోనే ప్రిలిమ్స్‌ను అక్టోబర్‌లో నిర్వహిస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..