TSPSC Group 2: తెలంగాణ గ్రూప్‌ 2 అభ్యర్థులకు అలర్ట్‌.. పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.

|

Feb 28, 2023 | 8:12 PM

తెలంగాణలో గ్రూప్‌ 2 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అలర్ట్‌. పరీక్షల తేదీని టీఎస్‌పీఎస్సీ మంగళవారం ప్రకటించింది. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. పరీక్షలకు వారం రోజుల ముందు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌...

TSPSC Group 2: తెలంగాణ గ్రూప్‌ 2 అభ్యర్థులకు అలర్ట్‌.. పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.
TS SET
Follow us on

తెలంగాణలో గ్రూప్‌ 2 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అలర్ట్‌. పరీక్షల తేదీని టీఎస్‌పీఎస్సీ మంగళవారం ప్రకటించింది. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. పరీక్షలకు వారం రోజుల ముందు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే గ్రూప్‌-2 నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 783 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

మొత్తం 783 ఖాళీలకు గాను 5,51,943 దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీపడనున్నారు. తెలంగాణలో గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటలకు ముగిసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయడం ఇది రెండో సారి. ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పరీక్షా తేదీని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే మొత్తం 783 ఖాళీలకుగాను.. మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3 – 11 పోస్టులు, అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్ – 59, డిప్యూటీ తహసీల్దార్‌ (నాయిబ్‌ తహసీల్దార్‌) – 98, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2 – 14 ఖాళీలు ఉన్నాయి.అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (కో–ఆపరేటివ్‌ సబ్‌ సర్వీసెస్‌) – 63, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్ – 09, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (మండల పంచాయతీ అధికారి)-126, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్ – 97 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు..అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(హ్యాండ్‌లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌) – 38, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌(జనరవ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్) – 165, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెక్రటేరియట్ – 15 ఖాళీలు ఉన్నాయి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..