TSPSC AMVI 2023 Hall tickets: ఏఎంవీఐ పోస్టులకు హాల్‌టికెట్లు విడుదల చేసిన టీఎస్పీయస్సీ.. మరో వారం రోజుల్లోనే పరీక్ష

|

Jun 21, 2023 | 1:14 PM

TSPSC AMVI 2023 Exam date: తెలంగాణలో అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టులకు నిర్వహించనున్న నియామక పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను టీఎస్పీయస్సీ బుధవారం (జూన్‌ 21) విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు..

TSPSC AMVI 2023 Hall tickets: ఏఎంవీఐ పోస్టులకు హాల్‌టికెట్లు విడుదల చేసిన టీఎస్పీయస్సీ.. మరో వారం రోజుల్లోనే పరీక్ష
TSPSC AMVI 2023 Hall tickets
Follow us on

హైదరాబాద్‌: తెలంగాణలో అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టులకు నిర్వహించనున్న నియామక పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను టీఎస్పీయస్సీ బుధవారం (జూన్‌ 21) విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌  నుంచి హాల్‌ టికెట్లు విడుదల చేసుకోవచ్చు. ఏఎంవీఐ నియామక రాత పరీక్ష జూన్ 28న జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాక్టీస్ మాక్‌ టెస్ట్‌లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 113 అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (AMVI) పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీయస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు మరో వారం రోజుల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం రెండు పేపర్లకు పరీక్ష ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.