TSNPDCL Recruitment: తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎవరు అర్హులంటే..

|

Dec 31, 2022 | 12:48 PM

తెలంగాణ నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌(TSNPDCL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హన్మకొండ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ పలు జిల్లాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.?

TSNPDCL Recruitment: తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎవరు అర్హులంటే..
Tsnpdcl Recruitment
Follow us on

తెలంగాణ నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌(TSNPDCL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హన్మకొండ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ పలు జిల్లాల వారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 157 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* యూన్‌ట్‌ల వారీగా చూస్తే.. హనుమకొండ (11), వరంగల్ (10), జనగాం (08), మహబూబాబాద్ (08), ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి (07), కరీంనగర్ (13), పెద్దపల్లి (10), జగిత్యాల (09), ఖమ్మం (15), బద్రాద్రి కొత్తగూడెం (10), నిజామాబాద్ (16), కామారెడ్డి (11), ఆదిలాబాద్ (07), నిర్మల్ (07), మంచిర్యాల (08), కుమురంభీం-ఆసిఫాబాద్ (06), కార్పొరేట్ ఆఫీస్ (1) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సీఏ, సీఐఎస్‌ఏ/ డీఐఎస్‌ఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు ఈఆర్‌పీ/ ఎస్‌ఏపీలో పరిజ్ఞానం
ఉండాలి. అలాగే సంబంధితం విభాగంలో కనీసం 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను ది ఛీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (ఆడిట్‌) టీఎస్‌ఎన్పీడీసీఎల్‌, కార్పొరేట్ ఆఫీస్‌, 3వ అంతస్తు, విద్యుత్‌ భవన్‌, నక్కలగుట్ట, హన్మకొండ, 506001 అడ్రస్‌లో అందించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 23-01-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..