యూపీఎస్సీ నిర్వహించే సీశాట్ 2024 (సివిల్ సర్వీసెస్)కు ఉచిత శిక్షణ అందించేందుకు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ, తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ అండ్ కెరియర్ కౌన్సెలింగ్ సెంటర్ ఉమ్మడిగా నోటిఫికేషన్ విడుదల చేశాయి. తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ కమ్యూనిటీలైన ముస్లిం, క్రిస్టియన్, సిఖ్, జైన్, బుద్ధిస్ట్, పార్శీకి చెందిన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 100 సీట్లు ఉంటాయి. మొత్తం సీట్లలో 33.33 శాతం సీట్లు మహిళలకు, 5 శాతం సీట్లు దివ్యాంగులకు కేటాయిస్తారు. ప్రవేశ పరీక్షలో కనబరిచే ప్రతిభ ఆధారంగా ఫిల్టర్ చేసి అర్హులను ఉచిత కోచింగ్‌కు ఎంపిక చేస్తారు.
జులై 13, 2023వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూన్ 26, 2023వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఏదైనా డిగ్రీ (జనరల్/ ప్రొఫెషనల్) ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐతే అభ్యర్థి తల్లిదండ్రుల వార్షికాదాయం తప్పనిసరిగా రూ.2 లక్షలకు మించకూడదు. స్క్రీనింగ్ టెస్ట్ జులై 23, 2023వ తేదీన నిర్వహిస్తారు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.