TS TET Topper 2022: తెలంగాణ టెట్‌ 2022 ఫలితాల్లో ప్రకాశం జిల్లా అభ్యర్థికి ఫస్ట్‌ ర్యాంక్‌

|

Jul 03, 2022 | 2:16 PM

తెలంగాణ టెట్‌ 2022 ఫలితాల్లో ప్రకాశం జిల్లాకు చెందిన జంధ్యాల అంజని మొదటి ర్యాంకు సాధించారు. గత శుక్రవారం (జులై 1)న విడుదలైన తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ ఫలితాల్లో పేపర్‌-1లో అంజని 133 మార్కులు..

TS TET Topper 2022: తెలంగాణ టెట్‌ 2022 ఫలితాల్లో ప్రకాశం జిల్లా అభ్యర్థికి ఫస్ట్‌ ర్యాంక్‌
Ts Tet 1st Ranker
Follow us on

TS TET 2022 First Ranker: తెలంగాణ టెట్‌ 2022 ఫలితాల్లో ప్రకాశం జిల్లాకు చెందిన జంధ్యాల అంజని మొదటి ర్యాంకు సాధించారు. గత శుక్రవారం (జులై 1)న విడుదలైన తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ ఫలితాల్లో పేపర్‌-1లో అంజనికి 133 మార్కులు వచ్చాయి. పేపర్‌-2లో కూడా అత్యధికంగా 129 మార్కులతో 5వ ర్యాంక్‌ సాధించడం గమనార్హం. తెలంగాణ అభ్యర్ధులను వెనక్కునెట్టి ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించి అందరినీ అబ్బురపరచింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన అంజని తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు. అంజని 2019లో బీఎస్సీ పూర్తి చేసింది. ఏపీలో కూడా టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలకావడంతో ప్రస్తుతం ఏపీ టెట్‌ రాసేందుకు సన్నద్ధమవుతోంది. కాగా తెలంగాణలో జూన్‌ 12న నిర్వహించిన పేపర్‌1కు మొత్తం 3,18,444 మంది హాజరుకాగా 32.68 శాతం మంది (1,04,078) ఉత్తీర్ణత సాధించారు. పేపర్‌ 2లో 2,50,897 మంది పరీక్ష రాస్తే 49.64 శాతం మంది (1,24,535) ఉత్తీర్ణత సాధించారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.