TSTET 2022: టెట్ అభ్యర్థులూ బీ అలర్ట్.. టెట్‌ వెబ్‌‌సై‌ట్‌లో పాత హాల్‌‌టి‌కెట్లు..

|

Mar 29, 2022 | 5:32 PM

TSTET 2022: విద్యా శాఖలో ఖాళీగా ఉన్న వేలాది ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా టీచర్ ఎలిజిబులిటీ

TSTET 2022: టెట్ అభ్యర్థులూ బీ అలర్ట్.. టెట్‌ వెబ్‌‌సై‌ట్‌లో పాత హాల్‌‌టి‌కెట్లు..
Ts Tet 2022 Notification
Follow us on

TSTET 2022: విద్యా శాఖలో ఖాళీగా ఉన్న వేలాది ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమవగా.. ఏప్రిల్ 12వ తేదీ వరకు అప్లికేషన్స్ స్వీకరించనున్నారు. అయితే, అప్లికేషన్ ప్రాసెస్‌లో భాగంగా పాత గతంలో టెట్ రాసినట్లయితే.. వాటికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్లను ఆడుగుతున్నారు. అయితే, చాలా ఏళ్ల తరువాత మళ్లీ టెట్ నిర్వహిస్తుండటంతో.. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్లను మరిచిపోయి అవస్థలు పడుతున్నారు. దీంతో వీరి సమస్యలను దృష్టిలో ఉంచుకున్న అధికారులు తాజాగా కీలక ప్రకటన చేశారు.

టెట్ దరఖాస్తు చేసే అభ్యర్థుల కోసం పాత హాల్‌ టికెట్ నెంబర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. 2011 నుంచి 2017 వరకు నిర్వహిం‌చిన 6 టెట్‌ పరీ‌క్షల హాల్‌‌టి‌కెట్‌ నంబ‌ర్లను వెబ్‌‌సై‌ట్‌లో పొందు‌ప‌రి‌చామని తెలిపారు. టీఎస్ టెట్‌ వెబ్‌సైట్‌లో ఈ నెంబర్లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. కాగా, టెట్‌కు అప్లికేషన్లు వెల్లువెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 12 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

కాగా, రాష్ట్రంలో 10 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా.. వాటిని భర్తీ చేసే ప్రక్రియను ప్రారంభించారు అధికారులు. అయితే, ఉపాధ్యాయ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు టెట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పాటు తరువాత ఇప్పటి వరకు రెండుసార్లు టెట్ నిర్వహించారు. 2016, 2017లో టెట్ నిర్వహించారు. అయితే, గతంలో టెట్ సర్టిఫికెట్‌కు ఏడు సంవత్సరాల వాలిడేషన్ మాత్రమే ఉండగా.. ఆ తరువాత దానిని మార్చారు. టెట్‌లో ఒక్కసారి అర్హత సాధిస్తే.. జీవితాంతం వర్తిస్తుంది. అయితే, టెట్‌లో వచ్చిన మారులకు ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా నిర్వహించే పరీక్షలకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయిస్తారు.

Also read:

Instagram Feature: యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌.. ఇకపై వాయిస్‌ రూపంలో..

SRH vs RR Playing XI IPL 2022: తొలిపోరుకు సిద్ధమైన మాజీ ఛాంపియన్లు.. రాజస్థాన్, హైదరాబాద్ ప్లేయింగ్‌ XI ఎలా ఉండనుందంటే?

Street Food India: ఓ వైపు ఉద్యోగం.. మరోవైపు సైకిల్‌పై మోమోస్ అమ్మకం.. నువ్వు సూపర్‌ గురూ అంటూ నెటిజన్ల ప్రశంసలు