TS TET 2024 Hall Tickets: నిరుద్యోగులకు అలర్ట్.. తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!

|

May 17, 2024 | 6:39 AM

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2024) హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. తెచ్చింది. టెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో జర్నల్‌ నంబర్‌, పుట్టిన తేదీ నమోదు చేసి హాల్‌ టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది నిర్వహించనున్న టెట్‌ పరీక్షకు దాదాపు 2.86 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు..

TS TET 2024 Hall Tickets: నిరుద్యోగులకు అలర్ట్.. తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
TS TET 2024 Hall Tickets
Follow us on

హైదరాబాద్‌, మే 17: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2024) హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. తెచ్చింది. టెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో జర్నల్‌ నంబర్‌, పుట్టిన తేదీ నమోదు చేసి హాల్‌ టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది నిర్వహించనున్న టెట్‌ పరీక్షకు దాదాపు 2.86 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక పరీక్షలు మే 20 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ షెడ్యూల్‌ను ప్రకటించింది. అయితే తొలిసారిగా ఈ ఏడాది టెట్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టులను విద్యాశాఖ నిర్వహిస్తోంది. టెట్‌ పరీక్షలను మొత్తం 11 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు.

తెలంగాణ టెట్ 2024 హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మే 27వ తేదీన పట్టభద్ర ఎన్నికలు జరగనుండటంతో ఈ తేదీన ఎలాంటి పరీక్ష లేకుండా విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంది. పేపర్‌ 2 పరీక్షలు మే 20 నుంచి జూన్ 2 వరకు ఆయా తేదీల్లో తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలలో మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి. మే 24వ తేదీన మైనర్‌ మీడియంలో సోషల్‌ స్టడీస్‌ పరీక్షలు జరుగుతాయి. జూన్‌ 1 తేదీన మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు మైనర్‌ మీడియంలో పరీక్షలు జరుగుతాయి. ఇక పేపర్‌ 1 పరీక్షలు మే 30 నుంచి జూన్‌ 2వ తేదీ వరకు తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలలో జరుగుతాయి. జూన్‌ 2న ఇంగ్లిష్‌, తెలుగు మీడియంలలో పేపర్‌ 1 పరీక్షలు నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

కాగా డీఎస్సీ నియామకాల్లో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందనే సంగతి తెలిసిందే. అలాగే ప్రభుత్వ టీచర్‌ పోస్టులకు నియమితులు కావాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) రాసేందుకు కూడా అర్హత సాధిస్తారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.