TG SET 2026 Notification: టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష తేదీలు ఇవే

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత కోసం నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TG SET) 2026 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం..

TG SET 2026 Notification: టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష తేదీలు ఇవే
Telangana State Eligibility Test

Updated on: May 19, 2026 | 10:53 AM

హైదరాబాద్, మే 19: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత కోసం నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TG SET) 2026 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ నెలలో తెలంగాణ సెట్‌ పరీక్షలు జరుగుతాయి. తెలంగాణ సెట్‌ పరీక్షలు పూర్తిగా ఆన్‌లైన్‌ (CBT) విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. సెట్‌ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు 300 మార్కులకు ఉంటుంది. పేపర్ 1లో 100 మార్కులకు గాను 50 ప్రశ్నలు, పేపర్ 2లో 200 మార్కులకు గాను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో పేపర్‌ 1 అర్హత పరీక్ష మాత్రమే. పరీక్ష రాయడానికి మొత్తం 3 గంటల సమయం కేటాయిస్తారు.

ఈ మేరకు షార్ట్‌ నోటిఫికేషన్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభ తేదీ, అర్హతలు, పరీక్ష సిలబస్‌, పరీక్ష తేదీలు, దరఖాస్తు చివరి తేదీ వంటి ఇతర పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని సెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ బి శ్రీనివాస్ తెలిపారు. ఇతర వివరాలకు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోండి.

టీజీ సెట్ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మే 21 నుంచి ఏఐ, ఎమర్జింగ్‌ టెక్నాలజీపై శిక్షణ

తెలంగాణ రాష్ట్రంలోని యువతకు ఏఐ, ఎమర్జింగ్‌ టెక్నాలజీలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్‌లో నాలుగు రోజుల సదస్సులు నిర్వహించనున్నట్లు బీసీ స్టడీసర్కిల్‌ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. మే 21 నుంచి జూన్‌ 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. సైదాబాద్‌లోని స్టడీసర్కిల్‌ ప్రధాన కార్యాలయంలో ఈనెల 21 నుంచి 26 వరకు సదస్సు ఉంటుందని వివరించారు. జిల్లాల వారీగా షెడ్యూలు త్వరలోనే ప్రకటించామని, రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని స్టడీసర్కిల్‌ళ్లలో ఏఐ, ఎమర్జింగ్‌ టెక్నాలజీపై శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us