TS Polycet 2022 exam: రేపే తెలంగాణ పాలీసెట్‌ పరీక్ష-2022.. ఈ నిబంధనలు తప్పనిసరి..

|

Jun 29, 2022 | 2:59 PM

తెలంగాణ పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS Polycet 2022) పరీక్ష రేపు (జూన్‌ 30) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల 30 నిముషాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. పరీక్ష నిర్వహణకు..

TS Polycet 2022 exam: రేపే తెలంగాణ పాలీసెట్‌ పరీక్ష-2022.. ఈ నిబంధనలు తప్పనిసరి..
Telangana Polycet
Follow us on

TS Polycet 2022 exam date: తెలంగాణ పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS Polycet 2022) పరీక్ష రేపు (జూన్‌ 30) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల 30 నిముషాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసినట్లు కన్వినర్‌ తెలిపారు. పాలీసెట్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు తప్పనిసరిగా హాల్‌ టికెట్లను పరీక్ష కేంద్రాలకు తీసుకురావాలని, కోవిడ్‌ నిబంధనలను విధిగా పాటించవల్సి ఉంటుందని ఈ సందర్భంగా విద్యార్ధులకు సూచించారు. పరీక్ష ముగిసిన అనంతరం12 రోజులకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు.

2022-23 విద్యా సంవ‌త్సరానికి సంబంధించి పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఎస్‌బీటీఈటీ (SBTET) ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. పాలీసెట్ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో న‌డుస్తోన్న పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ అగ్రిక‌ల్చర్‌ యూనివ‌ర్సిటీ, పీవీ న‌ర్సింహారావు తెలంగాణ యూనివ‌ర్సిటీతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నీక్ కోర్సులు అందించే సంస్థల్లో సీట్లను భ‌ర్తీ చేయ‌నున్నారు. తెలంగాణ పాలీసెట్ 2022కు సంబంధించిన తాజా అప్‌డేట్ల కోసం అధికారిక వెబ్‌సైట్ చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.