TS Model Schools: విద్యార్థులకు అలెర్ట్.. మోడల్‌ స్కూళ్లల్లో ప్రవేశాల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ.. వివరాలివే..

|

Mar 15, 2022 | 10:04 AM

తెలంగాణలోని మోడల్‌ స్కూళ్లల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు, 7 తరగతి నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే.

TS Model Schools: విద్యార్థులకు అలెర్ట్.. మోడల్‌ స్కూళ్లల్లో ప్రవేశాల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ.. వివరాలివే..
Model Schools
Follow us on

తెలంగాణలోని మోడల్‌ స్కూళ్లల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు, 7 తరగతి నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ మోడల్ స్కూళ్లలో (TS Model Schools) అడ్మిషన్లకు మంచి భారీ డిమాండ్ ఉంది. అత్యున్నత సదుపాయాలు, నాణ్యమైన విద్య అందుతుండడంతో మోడల్‌ స్కూళ్లలో చేరేందుకు విద్యార్థులు పోటీపడుతుంటారు. ఈ మోడల్ స్కూళ్లలో టెన్త్ నుంచి ఇంటర్ వరకు సెమీ రెసిడెన్షియల్ విధానంలో విద్యా బోధన ఉంటుంది. తాజాగా తెలంగాణలోని 194 మోడల్ స్కూళ్లలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి సీట్ల భర్తీకి షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో 100 సీట్లలో ప్రవేశాలను నిర్వహించనున్నారు. దీంతో మొత్తం 19400 మంది విద్యార్థులకు ప్రవేశాలను నిర్వహించనున్నారు. ఇంకా వివిధ కారణాలతో 7-10 వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

అయితే.. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు ధరఖస్తు చేసుకునేందుకు ఇవాళ్టితో ముగియనుంది. వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు రూ.150ను ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. వికలాంగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. వీళ్లు రూ.75 చెల్లిస్తే సరిపోతుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి అందులో అభ్యర్థులు సాధించిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: ఫిబ్రవరి 8, 2022

దరఖాస్తులకు ఆఖరి తేదీ: మార్చి 15, 2022

హాల్ టికెట్ల డౌన్ లోడ్: 6వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 17 నుంచి, 7-10 వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 9 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ప్రవేశ పరీక్ష: 6వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 17న, 7-10 తరగతుల వారికి ఏప్రిల్ 16న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎగ్జామ్ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఉంటుంది.

ప్రవేశ పరీక్ష ఫలితాలు: మే 20, 2022.

స్కూళ్ల వారీగా అభ్యర్థుల ఎంపిక: మే 23, 2022.

ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రదర్శన: మే 24, 2022.

సర్టిఫికేట్ల వెరిఫికేషన్: మే 24 నుంచి 31 వరకు ఉంటుంది.

క్లాసులు ప్రారంభం: ఏప్రిల్ 1, 2022

పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్‌లో చూడగలరు.

IGNOU: MBA కోర్సును ప్రారంభించిన IGNOU.. ఎలా నమోదు చేసుకోవాలో తెలుసుకోండి..

సీఎం కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం.. 36 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఇంటర్మీడియట్ స్థాయికి పెంపు