TS MHSRB Jobs: తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1147 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్‌ ప్రారంభం..

|

Dec 08, 2022 | 3:27 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ బోధనాసుపత్రులు, మెడికల్‌ కాలేజీల్లో.. 1147 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదల..

TS MHSRB Jobs: తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1147 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్‌ ప్రారంభం..
TS MHSRB Recruitment 2022
Follow us on

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ బోధనాసుపత్రులు, మెడికల్‌ కాలేజీల్లో.. 1147 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైనవారు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేయడంపై నిషేధం నిబంధన ఉంటుంది. అనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, బయో-కెమిస్ట్రీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా, రేడియో డయాగ్నోసిస్, రేడియేషన్ అంకాలజీ, సైకియాట్రీ, రెస్పిరేటరీ మెడిసిన్, డెర్మటాలజీ, అబ్‌స్టేట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, ఒటో-రైనో లారిన్జాలజీ-హెడ్ అండ్ నెక్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్, కార్డియాలజీ, థొరాసిక్ సర్జరీ/ కార్డియాక్ సర్జరీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూరాలజీ, న్యూరో-సర్జరీ ప్లాస్టిక్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ, పీడియాట్రిక్స్‌ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, మెడికల్ ఆంకాలజీ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు.

నేషనల్‌ మెడికల్ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. ఒప్పంద లేదా ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లుగా పనిచేస్తున్నా, గతంలో పనిచేసిన అనుభవం ఉన్న వారికి మార్కులుంటాయి. అభ్యర్ధుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి 44 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 5, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం డిసెంబర్‌ 20వ తేదీ నుంచి మొదలవుతుంది. జనరల్‌ కేటగిరి అభ్యర్ధులు రూ.500, ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/పీహెచ్‌/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కేటగిరీ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.68,900ల నుంచి రూ.2,05,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.