TS LAWCET 2022 Application Last Date: తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS LAWCET- 2022), తెలంగాణ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TSPGLCET-2022) ఎల్‌ఎల్‌బీతో పాటు రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం (LL.M) కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువును జులై 5 వరకు పొడిగిస్తున్నట్లు కన్వీనర్ జీబీ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కాగా తెలంగాణ లాసెట్ నోటిఫికేషన్ ఏప్రిల్ 2 విడుదలవగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 6 నుంచి ప్రారంభమయ్యింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్ధులు ఈ సదావకాశాన్ని సద్వినియోగపరచుకోవల్సిందిగా ఈ మేరకు కన్వీనర్ జీబీ రెడ్డి సూచించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎల్‌ఎల్‌బీకి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500, ఇతరులకు రూ.1000లు దరఖాస్తు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. లా ప్రవేశ పరీక్షలు జులై 21, 22 తేదీల్లో యథాతథంగా జరుగుతాయన, హాల్ టికెట్లు త్వరలో విడుదల చేస్తామని ఈ సదర్భంగా ఆయన తెలిపారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.