TS Inter Re-Verification 2025: ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా టాప్‌.. రేపట్నుంచి రీకౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌కు ఛాన్స్!

ఇంటర్ ఫలితాలు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, కోమటి రెడ్డి విడుదల చేశారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. మరింత ఉన్నత స్థాయికి విద్యార్థులు ఎదగాలని కోరుకుంటున్నానని అన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి విద్యార్థులకి అభినందనలు తెలిపారు..

TS Inter Re-Verification 2025: ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా టాప్‌.. రేపట్నుంచి రీకౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌కు ఛాన్స్!
TS Inter Re-Verification 2025

Updated on: Apr 23, 2025 | 5:57 AM

హైదరాబాద్‌, ఏప్రిల్ 22: తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలైనాయి. తాజా ఫలితాల్లో ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 66.89 శాతం, ఇంటర్ సెకెండ్ ఇయర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా (77.59 శాతం) టాప్‌లో నిలిచింది. సెకెండ్ స్థానం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన విద్యార్ధులు అత్యధిక ఉత్తీర్ణత నమోదు చేశారు. ఇక ఇంటర్ సెకెండ్ ఇయర్‌లో ఫస్ట్ ములుగు జిల్లా (80.12 శాతం), రెండో స్థానం ఆసిఫాబాద్ జిల్లా (79.52 శాతం)లకు చెందిన విద్యార్ధులు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు.

ఇక ఇంటర్‌ విద్యార్ధులకు రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు కూడా అవకాశం కల్పించారు. విద్యార్ధులు BIE వెబ్‌సైట్ http://tgbie.cgg.gov.in ఆన్‌లైన్ సర్వీసెస్ ద్వారా రీకౌంటింగ్‌కు ఒక్కో పేపర్ పేపర్‌కు రూ.100 చెల్లించాలి. స్కాన్ చేసిన కాపీ-కమ్-రివెరిఫికేషన్ కోసం రూ.600 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. రీకౌంటింగ్, స్కాన్ చేసిన కాపీ-కమ్-రీ-వెరిఫికేషన్ కోసం ఫీజు ఏప్రిల్ 23 నుంచి 30, 2025వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం ఇచ్చారు.

ఇంటర్ ఫలితాలు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, కోమటి రెడ్డి విడుదల చేశారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. మరింత ఉన్నత స్థాయికి విద్యార్థులు ఎదగాలని కోరుకుంటున్నానని అన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి విద్యార్థులకి అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.