నేటి నుంచి ప్రారంభమైన తెలంగాణ ICET 2022 దరఖాస్తు ప్రక్రియ..! ముఖ్య సమాచారం ఇదే..

|

Apr 06, 2022 | 8:14 AM

తెలంగాణ ఐసెట్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి (ఏప్రిల్‌ 6) ప్రారంభమౌతుంది. ఈ మేరకు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఏప్రిల్‌ 6 నుంచి..

నేటి నుంచి ప్రారంభమైన తెలంగాణ ICET 2022 దరఖాస్తు ప్రక్రియ..! ముఖ్య సమాచారం ఇదే..
Ts Cets 2022
Follow us on

TS ICET Exam Dates 2022: తెలంగాణ ఐసెట్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి (ఏప్రిల్‌ 6) ప్రారంభమౌతుంది. ఈ మేరకు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఏప్రిల్‌ 6 నుంచి జూన్‌ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ కాకయతీ యూనివర్సిటీ (Kakatiya University) ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం.. జనరల్ అభ్యర్ధులకు రూ.650, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు రూ.450లు దరఖాస్తు రుసుము చెల్లించాలి. నోటిఫికేషన్ తేదీ నాటికి19 ఏళ్లు నిండిన విద్యార్ధులు ఎవరైనా అధికారిక వెబ్‌సైట్ https://icet.tsche.ac.in/లో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులు జూలై 18 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. కాగా జులై 27, 28 తేదీల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఐసెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్‌ కీ ఆగస్టు 4న విడుదలవుతుంది. ఇక తుది ఫలితాలు ఆగస్టు 22న విడుదలౌతాయి. ఐసెట్‌ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా ఈ ప్రవేశ పరీక్షను ఉన్నత విద్యా మండలి (TSCHE) నిర్వహిస్తోంది.

తెలంగాణ ఐసెట్‌ 2022 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ కింది అర్హతలుండాలి..

  • మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) కోర్సులో ప్రవేశం పొందగోరే విద్యార్ధులు కనీసం 3 సంవత్సరాల వ్యవధి కలిగిన బ్యాచిలర్ డిగ్రీ (బీఏ/ బీకాం/బీఎస్సీ/బీబీఏ/బీబీఎం/బీసీఏ/బీఈ/బీటెక్‌/ బీఫార్మసీ/ లేదా తత్సమాన కోర్సుల్లో (ఓరియంటల్ భాషల్లో డిగ్రీ మినహా) ఉత్తీర్ణులై ఉండాలి.
  • మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) కోర్సులో ప్రవేశం పొందగోరే విద్యార్ధులు బీసీఏ/ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీ /బీఎస్సీ/బీకాం/మాథ్స్‌లో బీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Also Read:

Attention: తెలంగాణ ఎంసెట్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం! ఇలా దరఖాస్తు చేసుకోండి..