TS ICET 2022 application last date: తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐసెట్ 2022కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించినట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొ.కె.రాజిరెడ్డి సోమవారం (జూన్ 27) తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం జూన్ 27 దరఖాస్తు ప్రక్రియ ముగాయ నుండగా ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించకుండా జులై 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు . ఇప్పటి వరకు 59,500 మంది దరఖాస్తు చేసుకున్నారని, తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ప్రవేశ పరీక్ష జరుగుతుందని ప్రొ.కె.రాజిరెడ్డి తెలియజేశారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ https://icet.tsche.ac.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ ఐసెట్ 2022 పరీక్ష జులై 27, 28 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. ఈ పరాక్షకు సంబంధించిన ఫలితాలు ఆగస్టు 22న విడుదలౌతాయి. ఐసెట్ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా ఈ ప్రవేశ పరీక్షను ఉన్నత విద్యా మండలి (TSCHE) నిర్వహిస్తోంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.