TSPSC Group-1 Applications are increasing 2022: తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు దరఖాస్తులు పెరుగుతున్నాయి. మే 13కి కమిషన్‌కు అందిన దరఖాస్తుల సంఖ్య 93,813కు చేరుకుంది. ఇవి రోజుకు 10 వేల వరకు వస్తుండటంతో మే 14 నాటికి ఈ సంఖ్య లక్ష దాటనున్నట్లు కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. తొలిరోజు 3,895 దరఖాస్తులు వస్తే, పది రోజుల వ్యవధిలో ఆ సంఖ్య లక్షకు చేరువైంది. చివరి తేదీ నాటికి గ్రూప్-1 నోటిఫికేషన్‌కు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని కమిషన్ అంచనా వేస్తోంది. ఉద్యోగార్థులు ముందుగానే దరఖాస్తు చేసుకుంటే పరీక్ష కేంద్రాల కేటాయింపులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. దరఖాస్తులు ఎక్కువగా ఉంటే.. తొలి ఆప్షన్‌లోని కేంద్రాలు నిండిపోయి రెండో ఆప్షన్‌కు వెళ్లాల్సి వస్తుందని, దూరంగా కేంద్రాలు ఉంటే ప్రయాణ ఇక్కట్లు ఎదురవుతాయని ముందస్తు జాగ్రత్త పడుతున్నారు. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ల(ఓటీఆర్)లో కొత్త రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉన్నాయి. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 25 లక్షల మంది అభ్యర్థుల్లో కేవలం 2.2లక్షల మందే ఇప్పటి వరకు ఎడిట్ చేసుకున్నారు. కొత్త రిజిస్ట్రేషన్లు 1.04 లక్షలకు చేరుకున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 80,000ల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రూప్1తో పాటు పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా గ్రూప్1 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ మే 2 నుంచి ప్రారంభమైంది. మొత్తం 18 శాఖల్లో 503 పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ మే31తో ముగియనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ క్రమంలోనే ఓటీఆర్‌ను అప్ డేట్ చేసుకోవాలని అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సూచించింది. అప్ డేట్ చేసిన తర్వాతే దరఖాస్తుల చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు ఫామ్‌లో ఓటీఆర్ డేటానే తీసుకోనున్నారు. గడువు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే అప్లై చేసుకోవాలని అధికారులు అభ్యర్థులకు సూచిస్తున్నారు.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: