TS govt Jobs 2022: గ్రూప్స్‌, పోలీసు, ఉపాధ్యాయ పోస్టులకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందిస్తున్న సంస్థలివే!

తెలంగాణలో త్వరలో భర్తీ చేయనున్న 80 వేల కొలువుల నేపథ్యంలో.. జాబ్‌ కొట్టాలంటే గట్టిగానే సన్నద్ధమవ్వాలి. అందుకు కొందరు సొంతంగా ప్రిపరేషన్‌ ప్రారంభిస్తే, మరి కొందరేమో కోచింగ్‌ క్లాసుల బాట పట్టారు..

TS govt Jobs 2022: గ్రూప్స్‌, పోలీసు, ఉపాధ్యాయ పోస్టులకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందిస్తున్న సంస్థలివే!
Free Coaching
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 11, 2022 | 8:44 PM

Free Training centres in Telangana: తెలంగాణలో త్వరలో భర్తీ చేయనున్న 80 వేల కొలువుల నేపథ్యంలో.. జాబ్‌ కొట్టాలంటే గట్టిగానే సన్నద్ధమవ్వాలి. అందుకు కొందరు సొంతంగా ప్రిపరేషన్‌ ప్రారంభిస్తే, మరి కొందరేమో కోచింగ్‌ క్లాసుల బాట పట్టారు. మరి మా పరిస్థితి ఏంటని నిరుపేద నిరుద్యోగులు విచారించవల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోని పలు సంక్షేమ శాఖల ఉచిత కోచింగ్‌ క్లాసులు నిర్వహిస్తున్నాయి.శిక్షణకు శక్తి లేదన్న చింత వీడీ ఉచిత శిక్షణ కార్యక్రమాల ద్వారా సన్నద్ధమయ్యేందుకు దారులు ఇవిగో..!

గ్రేటర్‌ పరిధిలో గ్రూప్‌-1, గ్రూప్‌-2, కానిస్టేబుల్, ఉపాధ్యాయ పోస్టులకు సన్నద్ధమయ్యే వేల మంది అభ్యర్థులకు శిక్షణ, వసతితో పాటు స్టడీ మెటీరియళ్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఎస్టీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. డిగ్రీ, ఇంటర్‌లో మెరిట్, ప్రాథమిక పరీక్షలు నిర్వహించడం ద్వారా అర్హుల్ని ఎంపిక చేస్తామని ప్రకటించాయి. ఆయా శాఖలు అందిస్తున్న శిక్షణ వివరాలు మీకోసం..

బీసీ విద్యార్థులకు శిక్షణతో పాటు స్టైఫండ్‌ కూడా.. పోటీ పరీక్షలకు శిక్షణతో పాటు స్టైఫండ్‌ ఇస్తామని బీసీ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో ఏప్రిల్‌ 16 లోగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి అర్హుల్ని ఎంపిక చేస్తామంది. గ్రూప్‌-1, గ్రూప్‌-2, ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు శిక్షణ ఇవ్వనుంది. గ్రూప్స్‌ అభ్యర్థులకు నెలకు రూ.5 వేలు, గ్రూప్‌-2, ఎస్సై అభ్యర్థులకు రూ.2 వేలు భృతిగా ఇస్తారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ రెండింటిలోనూ శిక్షణ ఇస్తారు.

గ్రూప్స్, పోలీసు ఉద్యోగార్థులకు ఇలా.. గ్రూప్స్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు జిల్లాకు వంద మంది చొప్పున ఎంపిక చేసి శిక్షణ ఇస్తామని ఎస్సీ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఏప్రిల్‌ 18 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. మెటీరియల్‌కు రూ.1500, భోజన ఖర్చులకు రోజుకు రూ.75 చొప్పున ఇస్తామని ప్రకటించింది. వసతి కల్పించదు. పోలీసు ఉద్యోగాలకు జిల్లాకు వంద మందికి ప్రత్యేకంగా ఉచిత వసతితోపాటు శిక్షణ ఇవ్వనుంది. డిగ్రీ, ఇంటర్‌లో ప్రతిభ ఆధారంగా అర్హుల్ని ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఏప్రిల్‌ 12 వరకు అవకాశం ఉంది.

ఎస్టీ అభ్యర్థులకు గిరిజన సంక్షేమ శాఖ చేయూత.. గిరిజన సంక్షేమ శాఖ ప్రస్తుతం గ్రూప్‌-4 నియామకాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు మాత్రమే శిక్షణ ఇస్తామని ప్రకటించింది. జిల్లాకు వంద మంది చొప్పున ఉచిత శిక్షణ ఇస్తారు. హైదరాబాద్‌ జిల్లా అధికారులు ప్రత్యేకంగా వసతి సౌకర్యం కల్పించారు. అభ్యర్థులు ఏప్రిల్‌ 11లోగా ఆన్‌లైన్‌లో అర్జీలు సమర్పించాలి. పరిశీలన పరీక్షలో ప్రతిభ ఆధారంగా అర్హుల్ని ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి.

Also Read:

TCS Q4 Results Highlights: గత త్రైమాసికంలో 1,03,546ల నియామకాలు చేపట్టిన ఐటీ దిగ్గజ కంపెనీ! లాభాల బాటలో..