AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS EAPCET 2026 BiPC కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 12 నుంచి రిజిస్ట్రేషన్లు

తెలంగాణ ఈఏపీసెట్‌ 2026 బైపీసీ (BiPC) విద్యార్థులకు ఉన్నత విద్యాశాఖ కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. ఈఏపీసెట్-2026 (EAPCET-2026) ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ తాజాగా విడుదల చేసింది. ఫార్మసీ, ఫార్మ్-డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు..

TS EAPCET 2026 BiPC కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 12 నుంచి రిజిస్ట్రేషన్లు
TS EAPCET BiPC Counselling Schedule
Srilakshmi C
|

Updated on: Aug 30, 2026 | 2:49 PM

Share

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 30:  తాజా షెడ్యూల్‌ ప్రకారం తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 12న ప్రారంభం కానుంది. అభ్యర్థులు సెప్టెంబర్ 12 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుకింగ్ పూర్తి చేయాలి. సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. అనంతరం సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. తొలి విడత సీట్ల కేటాయింపును సెప్టెంబర్ 21లోపు ప్రకటించనున్నారు. సీటు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 21, 22 తేదీల్లో ఫీజు చెల్లించి, ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

టీజీ ఈఏపీసెట్‌ 2026 బైపీసీ తొలి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ తేదీలు: సెప్టెంబర్ 12–16
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు: సెప్టెంబర్ 15–17
  • వెబ్ ఆప్షన్ల నమోదు తేదీలు: సెప్టెంబర్ 16–18
  • సీట్ల కేటాయింపు తేదీ: సెప్టెంబర్ 21లోపు
  • ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలు: సెప్టెంబర్ 21–22

సెప్టెంబర్ 25 నుంచి తుది విడత కౌన్సెలింగ్

తొలి విడతలో సీటు రాని అభ్యర్థులు లేదా తదుపరి అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే వారికి సెప్టెంబర్ 25 నుంచి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 25న వివరాల నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ పూర్తి చేయాలి. సెప్టెంబర్ 26న సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. తొలి విడతలో ఇచ్చిన వెబ్ ఆప్షన్లు తుది విడతలో పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి అభ్యర్థులు తుది విడతలో మళ్లీ కొత్తగా తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులకు ఆప్షన్లు ఇవ్వాలి. తుది విడత సీట్ల కేటాయింపును సెప్టెంబర్ 29లోపు ప్రకటించనున్నారు. సీటు పొందిన వారు సెప్టెంబర్ 29, 30 తేదీల్లో ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అనంతరం సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 1 మధ్య సంబంధిత కళాశాలలో నేరుగా హాజరై అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్

  • వివరాల నమోదు, స్లాట్ బుకింగ్ తేదీలు: సెప్టెంబర్ 25
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ: సెప్టెంబర్ 26
  • వెబ్ ఆప్షన్లు తేదీలు: సెప్టెంబర్ 26–27
  • సీట్ల కేటాయింపు తేదీ: సెప్టెంబర్ 29లోపు
  • ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలు: సెప్టెంబర్ 29–30
  • స్పాట్‌ అడ్మిషన్లు: సెప్టెంబర్ 30–అక్టోబర్ 1

ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడం మంచిది

కౌన్సెలింగ్ సమయంలో కళాశాలలు, కోర్సుల ఎంపిక విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. సీటు పొందే అవకాశాలను పెంచుకునేందుకు వీలైనన్ని ఎక్కువ కళాశాలలు, కోర్సులను ప్రాధాన్యత క్రమంలో వెబ్ ఆప్షన్లలో నమోదు చేసుకోవడం మంచిది. కాలేజీల్లో చేరే సమయంలో ఒరిజినల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (TC)తో పాటు అవసరమైన సర్టిఫికేట్ల ప్రతులను సమర్పించి, వాటికి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలే సీట్ల భర్తీకి సంబంధించి స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను అక్టోబర్ 2లోపు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.

Follow Us