TS EAMCET: తెలంగాణలో ఇటీవల జరుగుతోన్న ఎంసెట్ కౌన్సిలింగ్ తీరును గమనిస్తే లెక్క మారుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో విద్యార్థుల ఆలోచనల్లో మార్పులు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపి విద్యార్థులు ఇప్పుడు సైన్స్ వైపు ఆసక్తి చూపిస్తున్నట్లు అర్థమవుతోంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విపరీమైన క్రేజ్ ఉన్న ఇంజనీర్ సీట్లకు ప్రస్తుతం డిమాండ్ తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ స్థానంలో బీఫార్మసీ సీట్లు పెద్ద ఎత్తున భర్తీ అయ్యాయి.
ఇటీవల ఎంసెట్ అగ్రికల్చర్ రాసిన విద్యార్థులకు తొలి విడత కౌన్సెలింగ్‌లో బీఫార్మసీ, ఫార్మాడీ సీట్లను కేటాయించారు. మొత్తం 8,807 సీట్లుండగా వీటిలో 8,394 అంటే 95.31 శాతం సీట్లు భర్తీ కావడం విశేషం. బీఫార్మసీలో 7562 సీట్లుకు 7162, ఫార్మాడీలో 1183కి 1170 సీట్లు నిండాయి. కేవలం 413 సీట్లు మాత్రమే మిగలడం గమనార్హం. మొత్తం 120 కళాశాలల్లో 43 చోట్ల సీట్లన్నీ భర్తీ అయ్యాయి. సీట్లు సాధించినవారు ఈనెల 10లోపు ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కన్వీనర్ నవీన్ తెలిపారు. అయితే ఇంజనీరింగ్ సీట్ల భర్తీ దీనికి పూర్తి భిన్నంగా కనిపించింది.
ఈసారి ఏకంగా 20 శాతం సీట్లు మిగిలిపోవడం గమనార్హం. తెలంగాణలో మొత్తం 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిలో సుమారు 79,856 సీట్లు ఉన్నాయి. ఎంసెట్ పరీక్ష అనంతరం కౌన్సెలింగ్‌లో 57,177 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. అంటే 22,679 సీట్లు మిగిలాయి. ఈ లెక్కన మొత్తం సీట్లల్లో 71.60 శాతం మాత్రమే భర్తీ అయ్యాయి.
YSRCP: ఏపీని ఆదుకోండి.. కేంద్రం అందించాల్సిన తోడ్పాటుపై అమిత్ షాకు వైసీపీ ఎంపీల విజ్ఞప్తి..