TS Eamcet 2023 Notification: నేడే విడుదలకానున్న తెలంగాణ ఎంసెట్‌-2023 నోటిఫికేషన్‌.. ఈసారి తగ్గనున్న సిలబస్

|

Feb 28, 2023 | 1:45 PM

తెలంగాణ ఎంసెట్-2023 ప్రవేశ పరీక్షలో ఇంటర్‌ ఫస్టియర్‌ నుంచి 30 శాతం సిలబస్‌ను మినహాయిస్తున్నట్లు, సెకండియర్‌లో పూర్తి సిలబస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయని..

TS Eamcet 2023 Notification: నేడే విడుదలకానున్న తెలంగాణ ఎంసెట్‌-2023 నోటిఫికేషన్‌.. ఈసారి తగ్గనున్న సిలబస్
TS EAMCET 2023
Follow us on

తెలంగాణ ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఈ,బీటెక్‌, బీఫార్మ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు టీఎస్‌ ఎంసెట్‌-2023 షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు మే 7 నుంచి 11 వరకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అగ్రికల్చరల్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌కు మే 12 నుంచి 14 వరకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఐతే ఈ ఏడాది నిర్వహించే ఎంసెట్‌లో సిలబస్‌ను తగ్గిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

ఈ ప్రవేశ పరీక్షలో ఇంటర్‌ ఫస్టియర్‌ నుంచి 30 శాతం సిలబస్‌ను మినహాయిస్తున్నట్లు, సెకండియర్‌లో పూర్తి సిలబస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయని పేర్కొంది. అంటే ఫస్టియర్‌ నుంచి కేవలం 70 శాతం, సెకండియర్‌లో 100 శాతం సిలబస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ డీన్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఫిబ్రవరి 28న విడుదలయ్యే తెలంగాణ ఎంసెట్‌ నోటిఫికేషన్‌లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. కాగా ఎంసెట్‌ షెడ్యూల్‌ ప్రకారం.. మార్చి 3 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.