TS EAMCET 2022 Exam Date: తెలంగాణ ఎంసెట్‌ 2022 పరీక్ష జూన్‌లో.. ఈ సారి కొత్తగా..

| Edited By: Ravi Kiran

Feb 18, 2022 | 11:48 AM

తెలంగాణ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ త్వరలో విడుదల కానుంది. జూన్‌లో ప్రవేశపరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా..

TS EAMCET 2022 Exam Date: తెలంగాణ ఎంసెట్‌ 2022 పరీక్ష జూన్‌లో.. ఈ సారి కొత్తగా..
Ts Eamcet 2022
Follow us on

TS EAMCET 2022 latest news: తెలంగాణ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ త్వరలో విడుదల కానుంది. జూన్‌లో ప్రవేశపరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా త్వరలో విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇప్పటికే జూన్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్‌ (ఫార్మసీ) కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష(Telangana State Engineering Agriculture and Medical Common Entrance Test ) నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రారంభించింది. సెట్‌ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ను ఇప్పటికే నియమించారు. ఈ వారం ఎంసెట్‌పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, కాలపట్టికను ప్రకటించే వీలుందని మండలి ఉన్నతాధికారులు తెలిపారు. ఫలితాలను కూడా నెలవ్యవధిలోనే ప్రకటించాలని నిర్ణయించారు. గత రెండేళ్లుగా కరోనా వల్ల ఎంసెట్‌ ప్రక్రియ ఆలస్యమవుతున్నందున ఈసారి సకాలంలో పరీక్ష, సీట్ల కేటాయింపు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ(TSFRC) ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల పెంపుపై కసరత్తు చేస్తోంది. 2019లో పెంచిన ఫీజులు 2021 వరకూ అమలులో ఉన్నాయి. ఒకవేళ ఫీజులు పెంచితే 2022 నుంచి అమలులోకి వచ్చే వీలుంది. ఆదాయ, వ్యయాల నివేదికలను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల నుంచి ఎఫ్‌ఆర్‌సీ కోరింది. ఈ గడువు ఈ నెలాఖరు (ఫిబ్రవరి)తో ముగుస్తుంది. మార్చి చివరి నాటికి ఫీజుల పెంపుపై ఎఫ్‌ఆర్‌సీ నిర్ణయాన్ని ప్రకటించే వీలుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 15 శాతం వార్షిక ఫీజును పెంచేందుకు ఎఫ్‌ఆర్‌సీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌ను ఏప్రిల్, మేలో పూర్తి చేసేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల సీట్ల కేటాయింపు ప్రక్రియ కూడా జూన్‌ ఆఖరు కల్లా పూర్తయ్యే అవకాశాలున్నట్టు ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలో సీట్లపై స్పష్టత వస్తుందని, అప్పుడు ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు వెళ్లవచ్చని పేర్కొన్నారు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభానికి ముందే కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈసారి డిమాండ్‌ ఉన్న కోర్సులకే సీట్లు అనుమతించాలని యోచిస్తున్నారు. సివిల్, మెకానికల్‌ కోర్సుల్లో 40 శాతానికి మించి అడ్మిషన్లు లేకపోవడంతో కొన్ని కాలేజీలు ఈ మేరకు సీట్లను తగ్గించుకునే ఆలోచనలో ఉన్నాయి. మరోవైపు కంప్యూటర్‌ సైన్స్, డేటాసైన్స్, ఆరిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ వంటి కోర్సులకు డిమాండ్‌ పెరిగింది.

Also Read:

NEET UG 2022 Exam date: నీట్ యూజీ 2022 పరీక్ష జూన్‌ చివర్లో లేదా జూలై మొదట్లో.. ఈ మార్పులు గమనించారా?