TS Eamcet 2022: తెలంగాణ ఎంసెట్‌ 2022లో ఇంటర్‌ వెయిటేజీ రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు

విద్యార్ధులకు ఎంసెట్ ర్యాంక్‌ కేటాయించాలంటే ఈసారి కూడా ఇంటర్‌లో కనీస మార్కులతో పాసైతే చాలు. ఈ మేరకు మినహాయింపునిస్తూ తెలంగాణ విద్యాశాఖ తాజాగా జీవో జారీ చేసింది..

TS Eamcet 2022: తెలంగాణ ఎంసెట్‌ 2022లో ఇంటర్‌ వెయిటేజీ రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు
Ts Eamcet 2022
Follow us

|

Updated on: Apr 12, 2022 | 4:15 PM

TS EAMCET 2022 eligibility criteria relaxed: విద్యార్ధులకు ఎంసెట్ ర్యాంక్‌ కేటాయించాలంటే ఈసారి కూడా ఇంటర్‌లో కనీస మార్కులతో పాసైతే చాలు. ఈ మేరకు మినహాయింపునిస్తూ తెలంగాణ విద్యాశాఖ తాజాగా జీవో జారీ చేసింది. పాత నిబంధనల ప్రకారం జనరల్‌ విద్యార్ధులు ఇంటర్‌లో 45 శాతం, మిగిలిన వారు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందటం తప్పనిసరిగా ఉంది. అంతేకాకుండా ఈ సారి ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ (25% weightage) కూడా ఉండదు. అంటే ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంక్‌ కేటాయిస్తారన్నమాట. కాగా తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET 2022) దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మే 28 (ఆలస్య రుసుము లేకుండా) వరకు కొనసాగనుంది.

జనరల్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.800. ఎస్సీ, ఎస్టీలకు రూ.400లు చెల్లించవల్సి ఉంటుంది. జులై 14,15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అలాగే జులై 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో, CBT మోడ్‌లో 3 గంటల పాటు నిర్వహించబడుతుంది. కాగా ఈ ఏడాది కూడా ఎంసెట్‌ను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బీఈ, బీటెక్‌, బీ ఫార్మసీ, డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమెటిక్స్‌) కోర్సుల్లో ప్రవేశం కల్పించనున్నారు. పూర్తి సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌eamcet.tsche.ac.inలో చెక్ చేసుకోవచ్చు.

Also Read:

Telangana: టీఎస్పీఎస్సీ Group 1, group 2 పోస్టులకు ఇంటర్వ్యూలు ఎత్తివేయనున్న తెలంగాణ సర్కార్‌! 2 రోజుల్లో విడుదలకానున్న జీవో..