TS CPGET 2024 Notification: తెలంగాణలో పీజీ ప్రవేశాలు.. టీఎస్‌ సీపీజీఈటీ నోటిఫికేషన్‌ విడుదల

|

May 16, 2024 | 6:33 AM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీజీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల తెలంగాణ రాష్ట్ర కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రవేశ పరీక్ష (టీఎస్‌ సీపీజీఈటీ) 2024 నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం..

TS CPGET 2024 Notification: తెలంగాణలో పీజీ ప్రవేశాలు.. టీఎస్‌ సీపీజీఈటీ నోటిఫికేషన్‌ విడుదల
TS CPGET 2024
Follow us on

హైదరాబాద్‌, మే 16: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీజీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల తెలంగాణ రాష్ట్ర కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రవేశ పరీక్ష (టీఎస్‌ సీపీజీఈటీ) 2024 నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం జులై 5న టీఎస్‌ సీపీజీఈటీ పరీక్ష జరగనుంది. ఈ ఏడాది కూడా సీపీజీఈటీ పరీక్షను ఆస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి, వైస్‌ఛైర్మన్‌ వెంకటరమణ, కార్యదర్శి శ్రీరాంవెంకటేశ్, ఉస్మానియా విశ్వవిద్యాలయ వీసీ రవీందర్, సెట్‌ కన్వీనర్‌ పాండురంగారెడ్డి, ఇతర విశ్వవిద్యాలయాల వీసీలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో.. దాదాపు 297 పీజీ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో 51 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ప్రవేశాలకు సీపీజెట్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 18 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు జూన్‌ 17వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. అంటే ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా జూన్‌ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో జూన్‌ 25 వరకు, రూ.2 వేల ఆలస్యరుసుంతో జూన్‌ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వివరించారు.

టీఎస్‌ సీపీజీఈటీ 2024 ప్రవేశ పరీక్షను జులై 5వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో (సీబీటీ)లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే జాబ్‌ మార్కెట్లో డిమాండ్‌ ఆధారంగా మరికొన్ని కొత్త పీజీ కోర్సులను కూడా ప్రవేశ పెడుతున్నట్లు ఆయన తెలిపారు. సీపీజెట్‌కి సంబంధించిన ఇతర సమాచారాన్ని www.osmania.ac.in, www.ouadmissions.com, www.cpget.tsche.ac.in వెబ్‌సైట్లలో చెక్‌ చేసుకోవచ్చని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.