హైదరాబాద్, జులై 31: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి ఆగస్టు 1 నుంచి ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్షలు జరనున్నయి. ఆగస్టు 1 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 104 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే హాల్‌టికెట్లు కూడా విడుదలయ్యాయి.
మొత్తం 19 రోజులపాటు రోజుకు మూడు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. ప్రతి సెషన్‌లో పరీక్ష 2 గంటలు ఉంటుంది. ఉదయం షిఫ్టు 8.30 నుంచి 10.30, మధ్యాహ్నం షిఫ్టు 12.30 నుంచి 2.30, సాయంత్రం షిఫ్టు 4.30 నుంచి 6.30 గంటల వరకు మూడో షిఫ్టు పరీక్ష జరుగుతుంది. టీజీటీ, ఎస్‌జీబీటీ, పీఈటీ పోస్టుల రాత పరీక్షలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.66 లక్షల మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులకు నియామక బోర్డు ముఖ్య సూచనలు జారీ చేసింది. అవేంటంటే..
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.