Telangana PRC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు చేయాలని ప్రకటిస్తూ ప్రభుత్వం శుభవార్త తెలిపిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తొలుత ప్రకటించిన దాని ప్రకారం ఏప్రిల్ నుంచే పీఆర్‌సీ అమలు కావాల్సి ఉంది. అయితే తొలుత ఎన్నికల కోడ్, అనంతరం కరోనా నేపథ్యంలో పీఆర్‌సీ అమలు వాయిదా పడుతూ వచ్చింది.
ఇదిలా ఉంటే ఈ నెల అయినా పీఆర్‌సీ అమల్లోకి వస్తుందా.? అంటే కాదనే సమాధానం వస్తోంది. మే నెల వేతనాలకు సంబంధించి కూడా పీఆర్సీ అమలు లేనట్టే కనిపిస్తోందని సమాచారం. కరోనా విజృంభిస్తోన్న ప్రస్తుత తరుణంలో పీఆర్‌సీ అమలు చేయడం సాధ్యం కాదని భావిస్తోన్న ప్రభుత్వం జూన్‌లో కొత్త జీతంతో పాటు ఏప్రిల్, మే బకాయిలను కూడా చెల్లించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని తెలుస్తోంది. అయితే జూన్‌లో కూడా పీఆర్సీ అమలు చేయడం సాధ్యమయ్యేలా కనిపిస్తోందని బహుశా జులైలో అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Telangana Govt: విద్యార్థులూ బీ అలర్ట్.. కీలక ప్రకటన చేసిన తెలంగాణ ప్రభుత్వం..