TGRJC 2025 Entrance Exam: రేపే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలకు ఎంట్రన్స్‌ టెస్ట్.. హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్‌ ఇదే!

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల జూనియర్​ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్​ఇంగ్లిష్‌ మీడియం ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలకు నిర్వహించే TGRJC 2025 ఇంటర్‌ ప్రవేశ పరీక్ష శనివారం (మే 10) జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది..

TGRJC 2025 Entrance Exam: రేపే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలకు ఎంట్రన్స్‌ టెస్ట్.. హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్‌ ఇదే!
TGRJC Entrance Exam Date

Updated on: May 09, 2025 | 5:05 PM

హైదరాబాద్‌, మే 9: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల జూనియర్​ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్​ఇంగ్లిష్‌ మీడియం ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలకు నిర్వహించే TGRJC 2025 ఇంటర్‌ ప్రవేశ పరీక్ష శనివారం (మే 10) జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లను ఇప్పటికే విడుదల చేయగా.. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

TGRJC 2025 ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలకు ఎంట్రన్స్‌ టెస్ట్ హాల్‌ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 35 గురుకుల జూనియర్​ కాలేజీల్లో.. బాలురకు 15, బాలికలకు 20 గురుకులాలు అందుబాటులో ఉన్నాయి. TGRJC 2025లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఆయా గురుకుల విద్యాలయ్యాల్లో ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో సీట్లు కేటాయిస్తారు. వీటిల్లో సీట్లు పొందిన విద్యార్ధులకు ఉచిత విద్యతోపాటు వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. 2025 మార్చిలో జరిగిన పదోతరగతి పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులైన విద్యార్ధులు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 35 గురుకుల జూనియర్‌ కాలేజీల్లో మొత్తం 2,996 వరకు సీట్లు ఉన్నాయి. వీటిల్లో ఎంపీసీ గ్రూపులో 1496 సీట్లు, బైపీసీ గ్రూపులో 1440 సీట్లు, ఎంఈసీ గ్రూపులో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మే 12న తెలంగాణ ఈసెట్‌ 2025 రాత పరీక్ష.. వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు విడుదల

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్‌సీ గణితం విద్యార్థులు నేరుగా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశం కోసం నిర్వహించే ఈసెట్‌ పరీక్ష మే 12న నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19,672 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది కంటే సుమారు 3 వేలమంది ఈ పరీక్షకు దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. ఈ పరీక్ష కోసం మొత్తం 86 పరీక్షా కేంద్రాల్లో జరగనుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.