AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ ఉద్యోగాల జాతర.. డీఈఓ, గెజిటెడ్ హెడ్‌మాస్టర్ పోస్టుల భర్తీకి TGPSC నోటిఫికేషన్‌

TGPSC Deputy Educational Officer Recruitment 2026: విద్యాశాఖ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు టీజీపీఎస్‌సీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌, గెజిటెడ్ హెడ్‌మాస్టర్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్న ఈ నియామకాలకు జూన్ 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హతలు, పరీక్షా విధానం, ఫీజు వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కమిషన్ సూచించింది..

ప్రభుత్వ ఉద్యోగాల జాతర.. డీఈఓ, గెజిటెడ్ హెడ్‌మాస్టర్ పోస్టుల భర్తీకి TGPSC నోటిఫికేషన్‌
TGPSC Deputy Educational Officer Recruitment
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Jun 05, 2026 | 8:20 PM

Share

హైదరాబాద్‌, జూన్‌ 5: తెలంగాణలోని నిరుద్యోగులకు, ముఖ్యంగా విద్యాశాఖలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ మరియు గెజిటెడ్ హెడ్‌మాస్టర్ గ్రేడ్ 1 పోస్టుల భర్తీకి గురువారం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు టీజీపీఎస్‌సీ కార్యాలయం ఒక ప్రెస్ నోట్ ద్వారా వివరాలను వెల్లడించింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, గెజిటెడ్ హెడ్‌మాస్టర్ గ్రేడ్-I పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 01/07/2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యా అర్హతలు, సిలబస్, పరీక్షా విధానం, ఫీజు మరియు ఇతర పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించవచ్చని టీఎస్‌పీఎస్‌సీ సెక్రటరీ తెలిపారు. విద్యాశాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 12 నుండి ప్రారంభం కానున్నందున, అభ్యర్థులు ముందే తమ వివరాలను సరిచూసుకుని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: 5 జూన్ 2026.
  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 12 జూన్ 2026.
  • దరఖాస్తుకు చివరి తేదీ: 19 జూలై 2026.

Follow Us