TGPSC Group 3 Jobs 2025: టీజీపీఎస్సీ గ్రూప్ 3 అభ్యర్ధులకు అలర్ట్.. రేపట్నుంచే ధ్రువపత్రాల పరిశీలన

TGPSC Group3 Certificate Verification Dates: గ్రూప్‌ 3 అభ్యర్ధులకు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కీలక అప్‌డేట్ జారీ చేసింది. మెరిట్ లిస్ట్‌లో విజేతలైన వారి ధ్రువపత్రాల పరిశీలన సోమవారం (నవంబర్‌ 10) నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రక్రియ నవంబర్‌ 26 వరకు కొనసాగుతుందని పేర్కొంది. గ్రూప్ 3 పోస్టులకు ఎంపికైన..

TGPSC Group 3 Jobs 2025: టీజీపీఎస్సీ గ్రూప్ 3 అభ్యర్ధులకు అలర్ట్.. రేపట్నుంచే ధ్రువపత్రాల పరిశీలన
TGPSC Group 3 Certificate Verification Dates

Updated on: Nov 09, 2025 | 2:29 PM

హైదరాబాద్‌, నవంబర్‌ 9: తెలంగాణ గ్రూప్‌ 3 అభ్యర్ధులకు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కీలక అప్‌డేట్ జారీ చేసింది. మెరిట్ లిస్ట్‌లో విజేతలైన వారి ధ్రువపత్రాల పరిశీలన సోమవారం (నవంబర్‌ 10) నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రక్రియ నవంబర్‌ 26 వరకు కొనసాగుతుందని పేర్కొంది. గ్రూప్ 3 పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులు నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో నిర్వహించనున్నట్లు టీజీపీఎస్‌సీ తన ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాలకు కమిషన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్ధులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతోపాటు జిరాక్స్ సెట్లు కూడా 2 తమతోపాటు తీసుకురావాలని కమిషన్‌ కార్యదర్శి ప్రియాంక సూచించారు.

కాగా మొత్తం మొత్తం 1388 గ్రూప్ 3 పోస్టులకు గానూ ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. టీజీపీఎస్సీ గ్రూప్ 3 పోస్టుల భర్తీకి సంబంధించి 2024 నవంబర్‌ 17, 18 తేదీల్లో రాత పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.67 లక్షల మంది ఈ పరీక్షలు రాశారు. దాదాపు ఏడాది తర్వాత వీటి ఫలితాలు కమిషన్‌ వెల్లడించింది. పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌తో మార్చి 14న విడుదలైంది. 2024 నవంబరు 17, 18ల్లో రాత పరీక్షలు జరిగాయి. దాదాపు 2.67 లక్షల మంది హాజరయ్యారు. ఇటీవల ఈ పోస్టులకు సంబంధించిన మెరిట్‌ జాబితా విడుదలైంది. ఇందులోని అభ్యర్ధులందరూ రేపట్నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.