AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSLPRB APP Jobs 2025: ఏపీపీ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేయలేదా? అయితే మీకు ఇదే చివరి ఛాన్స్‌..

రాష్ట్రంలో 118 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యుటర్‌ పోస్టులకు రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు కూడా మొదలైనాయి. అయితే తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ద‌ర‌ఖాస్తుల గ‌డువు..

TSLPRB APP Jobs 2025: ఏపీపీ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేయలేదా? అయితే మీకు ఇదే చివరి ఛాన్స్‌..
TGLPRB APP Application
Srilakshmi C
|

Updated on: Oct 07, 2025 | 10:34 AM

Share

హైదరాబాద్, అక్టోబర్‌ 7: తెలంగాణ రాష్ట్రంలో 118 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యుటర్‌ పోస్టులకు రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు కూడా మొదలైనాయి. అయితే అక్టోబ‌ర్ 5వ తేదీన సాయంత్రం 5 గంట‌ల‌తో ద‌ర‌ఖాస్తుల గ‌డువు ముగిసింది. వ‌రుస‌గా సెలవులు రావ‌డం, భారీ వర్షాల నేపథ్యంలో దరఖాస్తు గడువు పొడిగించాలని కొందరు అభ్యర్థుల నుంచి వ‌చ్చిన విజ్ఞప్తుల మేర‌కు బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 11వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగిస్తూ తాజాగా ప్రకటన జారీ చేసింది.

ఇప్పటి వరకు ఈ పోస్టుల‌కు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7183 మంది రిజిస్ట్రర్ చేసుకోగా.. ఇందులో ఆదివారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు 2193 మంది మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అంటే కేవ‌లం 30 శాతం మంది త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఈ మేర‌కు దరఖాస్తు గడువు పొడిగిస్తూ టీఎస్ఎల్‌పీఆర్బీ అధికారిక ప్రక‌ట‌న విడుద‌ల చేసింది. ఇతర వివరాలకు www.tgprb.in వెబ్‌సైట్‌ సందర్శించాలని సూచించింది. కాగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రాష్ట్రంలోని క్రిమినల్‌ కోర్టుల్లో మూడేళ్లకుపైగా ప్రాక్టీస్‌ చేసిన లాయర్లు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

తెలంగాణ ఐసెట్‌ 2025 స్పెషల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలు విడుదల

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఐసెట్‌ స్పెషల్‌ ఫేజ్‌ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి తాజాగా షెడ్యూల్‌ విడుదల చేసింది. కొత్తగా స్లాట్‌ బుక్‌ చేసుకున్న అభ్యర్థులు అక్టోబర్‌ 7వ తేదీ వరకు ఆప్షన్స్‌ ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించినట్లు అందులో పేర్కొంది. ఇక అక్టోబర్‌ 10వ తేదీలోపు ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు పూర్తవుతుందని కన్వీనర్‌ శ్రీదేవసేన ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు