TG 10th Class Exams 2026: రేపట్నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. పూర్తి టైం టేబుల్‌ ఇదే

రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి. వీరితోపాటు ఇంప్రూవ్‌మెంట్ రాసే విద్యార్ధులు కూడా ఈ పరీక్షలు రాయనున్నారు. టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 5 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా..

TG 10th Class Exams 2026: రేపట్నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. పూర్తి టైం టేబుల్‌ ఇదే
TG SSC Advanced Supplementary Exams

Updated on: Jun 04, 2026 | 3:55 PM

హైదరాబాద్‌, జూన్‌ 4: ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్ధులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి. వీరితోపాటు ఇంప్రూవ్‌మెంట్ రాసే విద్యార్ధులు కూడా ఈ పరీక్షలు రాయనున్నారు. టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 5 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31,542 మంది విద్యార్ధులు హాజరవుతారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కందిమళ్ల లింగయ్య తెలిపారు. మొత్తం 93 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఆయా తేదీల్లో రోజూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్‌ టికెట్లను పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే విడుదల చేసింది. విద్యార్థులు తమ జిల్లా పేరు, స్కూల్‌ పేరు, పుట్టిన తేదీ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Also Read: పులి, మేక, గడ్డి, రైతు.. నది ఎలా దాటాలి? మీ తెలివితేటలకు సవాల్‌ విసిరే చిక్కు ప్రశ్న

తెలంగాణ పదో తరగతి 2026 సప్లిమెంటరీ పరీక్షల పూర్తి టైం టేబుల్ ఇదే..

  • జూన్‌ 5న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (గ్రూప్‌-ఎ) పరీక్ష
  • జూన్‌ 6న సెకండ్ లాంగ్వేజ్‌
  • జూన్‌ 7న థర్డ్‌ లాంగ్వేజ్‌ (ఇంగ్లిష్‌)
  • జూన్‌ 8న మ్యాథమెటిక్స్‌
  • జూన్‌ 9న సైన్స్‌ పార్ట్‌-1 (ఫిజికల్‌ సైన్స్‌)
  • జూన్‌ 10న సైన్స్ పార్ట్‌-2 (బయాలాజికల్‌ సైన్స్‌)
  • జూన్‌ 11న సోషల్‌ స్టడీస్‌ ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్‌ పరీక్షలు
  • జూన్‌ 12వ తేదీన ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్‌ పేపర్‌-2 పరీక్షలు

Also Read: IAS ట్రిక్కీ ప్రశ్న: ఓ వ్యక్తి 1925లో పుట్టి, 1925లోనే చనిపోయాడు.. అయినా 70 ఏళ్లు బతికాడు! ఇదెలా సాధ్యం?

ఇవి కూడా చదవండి

ఇప్పటికే పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కందిమళ్ల లింగయ్య తెలిపారు. విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టులకు తప్పనిసరిగా హాజరుకావాలని, ఏ పరీక్షను వదిలివేయవద్దని సూచించారు.

 

Follow Us