AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Polycet 2026 counselling: తెలంగాణ పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. మే 21 నుంచి రిజిస్ట్రేషన్లు షురూ

టీజీ పాలీసెట్ 2026 అడ్మిషన్ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యా శాఖ సోమవారం విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం తొలి దశ కౌన్సెలింగ్ మే 27న ప్రారంభం కానుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ మే 21 నుంచి 31 వరకు జరుగుతుంది. ఆ తర్వాత మే 29 నుంచి జూన్ 1 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్..

TS Polycet 2026 counselling: తెలంగాణ పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. మే 21 నుంచి రిజిస్ట్రేషన్లు షురూ
TG POLYCET counselling schedule
Srilakshmi C
|

Updated on: May 19, 2026 | 7:44 AM

Share

హైదరాబాద్‌, మే 19: తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పాలీసెట్) 2026 అడ్మిషన్ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యా శాఖ సోమవారం విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం తొలి దశ కౌన్సెలింగ్ మే 27న ప్రారంభం కానుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ మే 21 నుంచి 31 వరకు జరుగుతుంది. ఆ తర్వాత మే 29 నుంచి జూన్ 1 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. వెబ్ ఆప్షన్లు మే 29 నుంచి జూన్ 3 వరకు అందుబాటులో ఉంటాయి. తాత్కాలిక సీట్ల కేటాయింపు జూన్ 6న లేదా అంతకంటే ముందే ఉండే అవకాశం ఉంది. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 6 నుంచి 9 మధ్య వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, స్వీయ-రిపోర్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

టీజీ పాలీసెట్ 2026 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అభ్యర్థులు జూన్ 8, 9 తేదీలో తమకు కేటాయించిన కాలేజీల్లో హాజరు కావాలి. ఇక 2026-27 విద్యా సంవత్సరం జూన్ 9న ప్రారంభమవుతుంది. అంటే జూన్‌ 9వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. జూన్ 9, 10 తేదీలలో ఓరియెంటేషన్ జరగనుంది. పాలీసెట్ తుది దశ రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ జూన్ 15న, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూన్ 16న జరుగుతుంది. వెబ్ ఆప్షన్లను జూన్ 16, 17 తేదీలలో నమోదు చేసుకోవాలి. తాత్కాలిక సీట్ల కేటాయింపు జూన్ 20న లేదా అంతకంటే ముందు జరుగుతుంది. ఫీజు చెల్లింపులు, ఆన్‌లైన్‌లో స్వీయ-రిపోర్టింగ్ జూన్ 20 నుంచి 22 మధ్య పూర్తి చేయాలి. విద్యార్థులు జూన్ 22, 23 తేదీల్లో తమకు కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కేంద్రీకృత అంతర్గత స్లైడింగ్ (ఒకే కళాశాలలో కానీ వేరే బ్రాంచ్‌కు) కోసం వెబ్ ఆప్షన్‌లను జూన్ 27, 28 తేదీలలో అందుబాటులో ఉంటాయి. కేంద్రీకృత అంతర్గత స్లైడింగ్ ద్వారా ఎంపికైన అర్హులైన అభ్యర్థులకు ఫీజు వాపసు ఇస్తారు. జూన్ 30న లేదా అంతకంటే ముందు సీట్లు కేటాయింపు ఉంటుంది. అభ్యర్థులు జూలై 1న అదే కాలేజీలోని కొత్త బ్రాంచ్‌లో చేరవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో స్పాట్ అడ్మిషన్ల కోసం మార్గదర్శకాలను జూలై 1న అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతారు. జూలై 8తో స్పాట్ అడ్మిషన్లు పూర్తి అవుతాయి.

టీజీ పాలీసెట్ 2026 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?
ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు