Agnipath: అగ్నిపథ్‌ నియామకాలకు విశేష స్పందన.. నేవీలో 10 వేల మంది మహిళల దరఖాస్తులు..

|

Jul 04, 2022 | 7:30 PM

Agnipath: ఇండియన్‌ ఆర్మీలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో ఈ విధానంపై వ్యతిరేకత వచ్చినా.. తర్వాత...

Agnipath: అగ్నిపథ్‌ నియామకాలకు విశేష స్పందన.. నేవీలో 10 వేల మంది మహిళల దరఖాస్తులు..
Follow us on

Agnipath: ఇండియన్‌ ఆర్మీలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో ఈ విధానంపై వ్యతిరేకత వచ్చినా… తర్వాత కేంద్రం కొన్ని మార్పులు చేయడంతో నిరసనలు తగ్గాయి. ఇప్పటికే ఈ పథకం ద్వారా వాయు సేవలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జూలై 1 నుంచి ఇండియన్‌ నేవీ, ఆర్మీల్లో నియామకాల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరరిస్తున్నారు. ఇదిలా ఉంటే దరఖాస్తుల ప్రక్రియకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది.

ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఆదివారం నాటికి 10 వేల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. తొలిసారిగా నావికాదళలంలో మహిళలను సెయిలర్లుగా నియమించుకునేందుకు ఇండియన్‌ నేవీ అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో తొలిసారే మహిళలు పెద్ద ఎత్తున ఆసక్తి చూడం విశేషం. ప్రస్తుతం నేవీలో అగ్నివీరుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జులై 15 నుంచి 30 వరకు అప్లికేషన్లను తీసుకోనున్నారు.

ఇదిలా ఉంటే అగ్నిపథ్‌ నియామకాలపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో అగ్నివీరులకు రక్షణశాఖ, కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో 10 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..