Telugu University Admissions 2025: మ్యాజిక్, ఫిల్మ్ డైరెక్షన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు తెలుగు వర్సిటీ నోటిఫికేషన్‌..

సినిమా రంగం క్రేజ్ అంతా ఇంతాకాదు. ఒక్క సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ డమ్‌తోపాటు కోట్ల రూపాయలు ముంగిట్లో వచ్చి పడతాయి. గత కొంత కాలంగా దేశంలో పాన్‌ ఇండియా మువీస్‌ ట్రెండ్‌ నడుస్తోంది. దీంతో అధిక మంది యువత ఏదో రకంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని తెగ ఉవ్విళ్లూరుతున్నారు. ఇలాంటి వారికి అద్భుత అవకాశం..

Telugu University Admissions 2025: మ్యాజిక్, ఫిల్మ్ డైరెక్షన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు తెలుగు వర్సిటీ నోటిఫికేషన్‌..
Film Direction Course Admissions

Updated on: Jul 22, 2025 | 3:03 PM

హైదరాబాద్‌, జులై 22: నేటి యువతను మరింత ఊరిస్తున్న ఫీల్డ్ ఏదైనా ఉందంటే అది సినిమా రంగం. ఒక్క సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ డమ్‌తోపాటు కోట్ల రూపాయలు ముంగిట్లో వచ్చి పడతాయి. గత కొంత కాలంగా దేశంలో పాన్‌ ఇండియా మువీస్‌ ట్రెండ్‌ నడుస్తోంది. దీంతో అధిక మంది యువత ఏదో రకంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని తెగ ఉవ్విళ్లూరుతున్నారు. ఇలాంటి వారికి అద్భుత అవకాశం వచ్చింది. హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం 2025-2028 విద్యా సంవత్సరానికి డిప్లొమా ఇన్ మ్యాజిక్, డిప్లొమా ఇన్ ఫిల్మ్ డైరెక్షన్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు తుది గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ హనుమంతరావు ఓ ప్రటకనలో తెలిపారు.

నాంపల్లి ప్రాంగణంలో సాయంత్రం కోర్సుగా నిర్వహించే మ్యాజిక్ (ఇంద్రజాలం), ఫిల్మ్ డైరెక్షన్‌ కోర్సులకు జులై 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇంద్రజాలం కోర్సు వివరాలకు సామలవేణు ఫోన్‌ నెంబర్‌ 9059794553 ద్వారా సంప్రదించవచ్చని, ఫిల్మ్ డైరెక్టన్ కోర్ట్చుర్సు కోసం డా.రాజు ఫోన్‌ నంబర్‌ 834646773 ద్వారా సంప్రదించాలని తెలిపారు.

తెలంగాణ విదేశీ విద్యానిధి 2025కి దరఖాస్తులు ఆహ్వానం.. పూర్తి వివరాలు ఇవే

తెలంగాణ రాష్ట్రంలో అంబేడ్కర్‌ విదేశీ విద్యానిధి పథకం కింద అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఎస్సీ సంక్షేమశాఖ ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు ఈ-పాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమ శాఖ కమిషనర్‌ క్షితిజ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ-పాస్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చన సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.