తెలంగాణ పోస్టు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఈసెట్)- 2022కు సంబంధించి ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తైన సంగతి తెలిసిందే. ఐతే రెండు విడతల కౌన్సెలింగ్‌లలో సీట్లు పొందని విద్యార్ధులు స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నవంబర్ 9 నుంచి నిర్వహించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పి రమేష్‌బాబు తెలిపారు. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ నవంబర్ 9 నుంచి 11 వరకు ఉంటుందన్నారు. అలాగే నవంబర్ 11, 12 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని సూచించారు. నవంబర్ 15న సెలక్షన్ లిస్టు విడుదల చేస్తారు. ఎంపికైన విద్యార్ధులు సంబంధిత సెంటర్‌లలో నవంబర్ 15 నుంచి 19 వరకు నిర్వహించే వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరుకావల్సి ఉంటుందని అన్నారు.
కాగా 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీఈసెట్ 2022లో సాధించిన ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్‌లో ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్ధులకు రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో ఎమ్‌ఈ/ఎంటెక్/ఎంఫార్మసీ/ఎంఆర్క్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ హెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ఈ మేరకు విడుదల చేసింది. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.